BigBoss 7: తెలుగు తెరపై బిగ్ బాస్ ఎంతటి సంచలనం సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికి 6సీజన్లు పూర్తి చేసుకుని గత ఆదివారం బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమైంది. కొత్త కొత్త టాస్క్ లు, ట్విస్ట్ లతో ఫుల్ జోష్ లో ముందుకు సాగుతోంది. తొలి రోజు మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి వారం రతిక రోజ్, ప్రిన్స్ యావర్, షకీల, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, గౌతమ్ కృష్ణ, సింగర్ దామిని భట్ల మొత్తం 8మంది నామినేషన్స్ లో నిలిచారు. అయితే వీరిలో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
Read Also:G-20 Summit: రెండోరోజు G20 సమావేశాలు.. వాటిపైనే చర్చలు
నిన్న శనివారం కావడంతో హోస్ట్ నాగార్జున సందడి చేశారు. హైస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్ చేశారు. అలాగే కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్, తప్పులు, ఒప్పుల గురించి ప్రస్తావించారు. ఇక ఆదివారం ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్ గా సాగబోతోంది. కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్ తో పాటు మరో 8 మంది క్రేజీ కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టి రచ్చ చేయబోతున్నారు.
Read Also:Anil Kumar Yadav: చంద్రబాబు అరెస్ట్ కు ప్రజల్లో స్పందన లేదు..
ఈ లిస్ట్ లో సీరియల్ నటి పూజా మూర్తి ఒకరు. మొదటి వారమే ఆమె హౌస్ లోకి అడుగు పెట్టాల్సి ఉన్నా.. తండ్రి మరణం కారణంగా వెనకడుగు వేయాల్సి వచ్చింది. దీంతో రెండో వారంలో ఆమె బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటర్ అవబోతుంది. అలాగే హీరోయిన్ ఫర్జానా, సీరియల్ హీరో పవన్ సాయి, యాంకర్ వర్షిణి, నటుడు అంబటి అర్జున్, యాక్టర్ క్రాంతి, నిఖిల్, ఐశ్వర్య ప్రిన్సే, బోలే షావలి నేడు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.