Site icon NTV Telugu

GST: జీఎస్టీ ఎగవేతపై డీజీజీఐ ఉక్కుపాదం.. రూ.50 కోట్లకు పైగా పన్ను మోసాలు.. ఇద్దరు ఎండీలు అరెస్టు

Gst

Gst

సంఘటిత జీఎస్టీ (GST) పన్ను ఎగవేత కేసులపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) హైదరాబాద్ జోనల్ యూనిట్ దాడులను మరింత ముమ్మరం చేసింది. డేటా అనలిటిక్స్, అంతర-ఏజెన్సీ సమన్వయంతో సేకరించిన ప్రత్యేక సమాచారంతో, భారీ స్థాయిలో జరుగుతున్న అంతర్రాష్ట్ర పన్ను మోసాల వెనుక ఉన్న కీలక వ్యక్తులపై చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జీఎస్టీ చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డ ఇద్దరు ప్రముఖ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్లను డీజీజీఐ అధికారులు అరెస్టు చేశారు. 2025 జనవరి 6న జరిగిన ఈ అరెస్టులు పన్ను మోసాల తీవ్రతను మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి.

Also Read:ICC T20 World Cup: బంగ్లాదేశ్‌కు షాక్ ఇచ్చిన ఐసీసీ.. మ్యాచ్‌లు ఆడాలంటే భారత్‌కు రావాల్సిందే.. లేదంటే?

రూ.28.24 కోట్ల జీఎస్టీ వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేయని ఎండీ

మెస్‌ర్స్ ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (M/s Orange Passenger Transport Pvt Ltd) సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ప్రయాణికుల నుంచి వసూలు చేసిన రూ.28.24 కోట్ల జీఎస్టీని గడువు ముగిసిన మూడు నెలలు గడిచినా ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా అక్రమంగా దాచుకున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది.

రూ.22 కోట్ల నకిలీ ఐటీసీ మోసం

అదే విధంగా, మెస్‌ర్స్ ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ (M/s Trillion Lead Factory Pvt Ltd) మేనేజింగ్ డైరెక్టర్ చేతన్ ఎన్ (Chethan N) రూ.22 కోట్ల మేర నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) మోసానికి సూత్రధారిగా వ్యవహరించినట్టు డీజీజీఐ గుర్తించింది.

Also Read:Tirumala : తిరుమల శ్రీవారి సన్నిధిలో టాలీవుడ్ హీరోయిన్స్

CGST చట్టం ప్రకారం అరెస్టు

ఈ ఇద్దరిపై సీజీఎస్టీ చట్టం–2017 నిబంధనల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. సంఘటితంగా జరుగుతున్న పన్ను మోసాలపై నిరంతర ఒత్తిడి కొనసాగించేందుకు ఈ చర్యలు తీసుకున్నామని డీజీజీఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారులు చట్టాన్ని గౌరవిస్తూ వ్యవహరించాలని, జీఎస్టీ ఎగవేతకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని డీజీజీఐ హెచ్చరించింది.

Exit mobile version