Maoist: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. అగ్రనేతల లొంగుబాటు..
- మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ
- అగ్రనేతలు లొంగిపోయారు
- కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16మందితో కలిసి ఆయన తెలంగాణ SIB ముందు లొంగిపోయారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నక్సలిజాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను చేపట్టింది. ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మాతో పాటు చాలా మందిని మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. ఈ నేపథ్యంలో పలువురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అగ్రనేతలు లొంగిపోయారు.
Also Read:RTC Bus-Lorry Collision: గజ్వేల్ లో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. డ్రైవర్ కి తీవ్ర గాయాలు
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా ఐపీఎస్ కుమార్తె మృతి..
- Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్‌కు శుభవార్త.. సాయి సుదర్శన్‌కు బ్యాడ్ న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం..
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్ దేవ్ అలియాస్ తిప్పిరి తిరుపతి సరెండర్ అయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16మందితో కలిసి ఆయన తెలంగాణ SIB ముందు లొంగిపోయారు. మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామన్న కేంద్రం.. దేవ్, రాజిరెడ్డి టార్గెట్గా ఇటీవల ఆపరేషన్ కగార్-2 చేపట్టింది. ఈక్రమంలోనే వారిద్దరూ లొంగిపోయారు. 2 రోజుల్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
దేవ్ జీ… అలియాస్ తిప్పిరి తిరుపతి జగిత్యాల జిల్లాలోని అంబేద్కర్ నగర్‌లోని కోరుట్ల పట్టణానికి చెందినవాడు. అతని తండ్రి పేరు వెంకట్ నర్సయ్య, మాల కులానికి చెందినవాడు. అతను 1983లో మావోయిస్టు ఉద్యమంలో చేరి క్రమంగా ఉన్నత స్థానానికి ఎదిగి దక్షిణ భారత జోన్ ఆపరేటర్‌గా పనిచేశాడు. తిరుపతి పేరు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉంది, పార్టీ లోపల అతన్ని సంజీవ్, చేతన్, రమేష్, సుదర్శన్, దేవన్న అని పిలుస్తారు.
అతను పార్టీ భూగర్భ సైనిక ప్రచురణ అయిన అవామి జంగ్‌ను సవరించాడు. తిరుపతి, సెంట్రల్ మిలిటరీ కమిషన్‌లో సీనియర్ సభ్యుడు. దంతెవాడలో ఏప్రిల్ 2010లో జరిగిన మావోయిస్టు దాడిలో 74 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్ల హత్యకు తిరుపతి ప్రధాన సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు. నంబల కేశవరావు మరణం తరువాత , తిరుపతి సెప్టెంబర్ 2025లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
తాజావార్తలు
-
Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
-
Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా ఐపీఎస్ కుమార్తె మృతి..
-
Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
-
Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్‌కు శుభవార్త.. సాయి సుదర్శన్‌కు బ్యాడ్ న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం..
-
Jason Sanjay: “ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే” డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!