ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కుతుంది.. వీరిద్దరి కాంబో లో గతం లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో వస్తున్న దేవర సినిమా పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు మరియు టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త గెటప్ లో కనిపించనున్నట్లు సమాచారం.గతం లో ఎప్పుడూ లేనంత రఫ్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తుంది.
అంతేకాదు ఎన్టీఆర్ రోల్ కు సంబంధించి ఓ కీలక ట్విస్ట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆ ట్విస్ట్ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలవబోతున్నట్లు సమాచారం. అటు త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరో స్పెషల్ వీడియో గ్లింప్స్ రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త విన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ‘దేవర’ సినిమా వేసవి కానుక గా ఏప్రిల్ 5న విడుదల అవుతుందని అంతా భావించారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదు. రీసెంట్ గా ఈ సినిమా లో విలన్ రోల్ పోషిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డారు. ఆయన పార్ట్ షూటింగ్ పెండింగ్ లోనే ఉందని సమాచారం.అలాగే ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న అనిరుధ్ అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చేందుకు మరింత టైం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.దీనితో ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడనుందని సమాచారం.