Deva Katta: డ్రాగన్ డైరెక్షన్ రూమర్స్.. దేవా కట్టా కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deva Katta: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక క్రేజీ రూమర్ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారంలో ఉంది. ఒక భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించి, ఒక ప్రముఖ రైటర్ కమ్ డైరెక్టర్ ఒక ముఖ్యమైన సీన్‌ను డైరెక్ట్ చేయబోతున్నారనేది ఆ వార్త సారాంశం. ఆ బిగ్ ప్రాజెక్ట్‌కు మాటలు అందిస్తున్న సదరు దర్శకుడు, ఇప్పుడు ఏకంగా కెమెరా వెనుక నిలబడి ఒక కీలక భాగాన్ని తెరకెక్కించబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. దీంతో అందరి దృష్టి ప్రముఖ దర్శకుడు దేవ కట్టా వైపు మళ్లింది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన వారణాసి సినిమాతో పాటు ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న డ్రాగన్ సినిమాకి కూడా డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన డ్రాగన్ సినిమాలో ఒక సీన్ డైరెక్ట్ చేస్తున్నారని చర్చ జరిగింది.
అయితే, ఈ పుకార్లపై దర్శకుడు దేవ కట్టా గురువారం నాడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ గట్టి క్లారిటీ ఇచ్చారు. కేవలం క్లిక్స్ కోసం, వ్యూస్ కోసం కొందరు పనిగట్టుకుని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేవ కట్టా తన ట్వీట్లో.. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. “నేను వేరే ఏ సినిమాకు సంబంధించి ఒక్క షాట్ కూడా డైరెక్ట్ చేయడం లేదు” అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇలాంటి రూమర్స్ కేవలం వెబ్సైట్ క్లిక్స్ కోసం క్రియేట్ చేసినవని, ఇవి చాలా చౌకబారు ప్రచారాలని కొట్టిపారేశారు. ప్రస్తుతం తాను చేస్తున్న పనుల గురించి చెబుతూ, తన తదుపరి సినిమా స్క్రిప్ట్ వర్క్ అండ్ డెవలప్మెంట్లో బిజీగా ఉన్నట్లు దేవ కట్టా వెల్లడించారు. తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, భారీ సినిమా కోసం రాత్రి పగలు కష్టపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌పై తనకు ఎంతో నమ్మకం, ఉత్సాహం ఉన్నాయని.. సరైన సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలను అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు. ఇక తాజా క్లారిటీతో దేవ కట్టా వేరే సినిమాలకు ఘోస్ట్ డైరెక్షన్ చేస్తున్నారనే వార్తలకు పూర్తిగా చెక్ పడింది. ఆయన ఫోకస్ అంతా ఇప్పుడు తన నెక్స్ట్ సిల్వర్ స్క్రీన్ వండర్ పైనే ఉందని స్పష్టమైంది.
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!