NTV Telugu Site icon

Pawan Kalyan: ఎన్నికల తర్వాత తొలిసారి పిఠాపురం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్

Deputy Cm Pawan Kalyan

Deputy Cm Pawan Kalyan

Pawan Kalyan: వచ్చేవారంలో పిఠాపురంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మూడు రోజులపాటు తన సొంత నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.
ఎన్నికల ఫలితాలు తర్వాత తొలిసారి నియోజకవర్గానికి రానున్నారు. స్థానిక సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. సమగ్ర సమాచారంతో సమావేశానికి రావాలని అధికారులకు క్లారిటీ ఇచ్చారు.

Read Also: TDPP Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీపీ భేటీ

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి గెలిచిన పవన్‌ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. మంత్రివర్గ కూర్పులో భాగంగా పవన్ కల్యాణ్‌కు ఏపీ ఉపముఖ్యమంత్రిగా ప్రత్యేక గౌరవం దక్కింది. డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను సీఎం చంద్రబాబు కేటాయించారు. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన వచ్చేవారం పిఠాపురంలో పర్యటించనున్నారు. తనను అఖండ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కలుసుకొని నియోజక వర్గంలో పర్యటిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, స్థానిక కార్యకర్తలను తనే స్వయంగా వచ్చి కలుస్తానని, ఆ తర్వాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటించే కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు.