NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: సీజనల్ వ్యాధుల కట్టడిపై సమీక్ష.. వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన డిప్యూటీ సీఎం..

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: సీజనల్ వ్యాధుల వ్యాప్తి నిరోధంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ముదరకుండా ముందస్తు జాగ్రత్తలపై అసెంబ్లీ కమిటీ హాల్‌లో పవన్‌ కల్యాణ్ సమీక్ష చేపట్టగా.. ఈ సమావేశానికి మంత్రులు సత్యకుమార్, నారాయణ, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, పట్టణ, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సీజనల్ వ్యాధులపై సమీక్షలో అధికారులను వరుస ప్రశ్నలతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉక్కిరిబిక్కిరి చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై అధికారులను ఆయన నిలదీశారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను ఎందుకివ్వలేదంటూ పవన్ అసహనం వ్యక్తం చేశారు. ఆర్థిక సంఘం, స్థానిక సంస్థలకు చెందాల్సిన నిధులను సీఎఫ్‌ఎంస్ ఖాతాకు ఎంత మేర మళ్లించారో నివేదికివ్వాలని మంత్రి పవన్ ఆదేశించారుతాగునీటి సరఫరాలో లోపాల వల్ల విజయవాడలో డయేరియా కేసులు ఉత్పన్నమవుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధుల కట్టడికి నియంత్రణ విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Read Also: AP Crime: ఈపురుపాలెంలో మహిళ హత్య.. బాధిత కుటుంబాన్ని కలవాలని హోంమంత్రికి సీఎం ఆదేశం