Pawan Kalyan: గ్రామాల్లో అభివృద్ధి పనులు పండుగలా మొదలుపెట్టాలి
- గ్రామాల్లో అభివృద్ధి పనులు పండుగలా మొదలుపెట్టాలి
- అక్టోబర్ 14 నుంచి 20 వరకూ ప్రతి పల్లెలో పనులకు శ్రీకారం చుట్టాలి
- పంచాయతీరాజ్..గ్రామీణాభివృద్ధి శాఖలపై పవన్ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు సత్వరమే మొదలుపెట్టాలని, కూటమి పాలన మొదలుపెట్టాక పంచాయతీలకు నిధుల సమస్య లేకుండా చేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పాలన మొదలైన తొలి వంద రోజుల్లోనే 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.1987 కోట్లు, ఎన్ఆర్ఈజీఎస్. ద్వారా రూ.4500 కోట్లు నిధులు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించినందున నిధుల సమస్య ఉత్పన్నం కాదన్నారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి ప్రతి పంచాయతీలో అభివృద్ధి పనులను మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామ సభలలో ఆమోదించిన పనులు, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనుల ప్రారంభం గురించి ఈ సమావేశంలో చర్చించారు. 13,326 పంచాయతీల్లోనూ ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారని, ఆ మేరకు చేపట్టే పనులు, పని దినాల వివరాలను అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వెబ్ సైట్, డ్యాష్ బోర్డ్ ను ప్రారంభించారు.
Read Also: CM Chandrababu Naidu: తిరుమల లడ్డూ వివాదంపై మరోసారి చంద్రబాబు ఫైర్
Also Read
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
- Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
- Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
మొదలుపెట్టిన పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి..
అక్టోబర్ 14వ తేదీ నుంచి వారం రోజులపాటు పనుల ప్రారంభాన్ని ఒక పండగలా చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. 20వ తేదీ వరకూ పంచాయతీల్లో పనుల ప్రారంభానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. స్థానిక శాసన సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలను ఇందులో భాగస్వాములను చేయాలని స్పష్టం చేశారు. ఒక వేడుకలా చేయడం ద్వారా గ్రామాల్లో తమకు వచ్చిన నిధులు, వాటితో చేసే పనులపై ప్రజలకు సమాచారం ఉంటుందని వివరించారు. మొదలైన పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, తనిఖీలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణ తేజ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
YSRCP Nomination Row: ఏపీ స్థానిక ఎన్నికలపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు
-
Punganur Violence: పుంగనూరు ఘటనలో.. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు 50 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు!
-
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
-
Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే’.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
-
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!