NTV Telugu Site icon

Pawan Kalyan: పదవి ఉన్న లేకపోయినా నేను రాజా లాగే ఉంటాను..

Pawan 2

Pawan 2

కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్త పల్లి సెంటర్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిఠాపురం ప్రజలు తనకు చాలా బాధ్యతలు ఇచ్చారన్నారు. ఏలేరు సుద్దగడ్డ ఆధునికీకరణ చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. పిఠాపురంని టెంపుల్ టూరిజంగా డెవలప్ చేస్తామని తెలిపారు. పిఠాపురం ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనన్నారు. 18 నెలల్లో తీరం కోత సమస్యను పరిష్కరిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఉప్పాడ తీర ప్రాంతంను టూరిజం స్పాట్ గా మారుస్తానని అన్నారు.

IND vs PAK: లాహోర్ వేదికగా ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్.. ఛాంపియన్స్ ట్రోఫీ డ్రాఫ్ట్ సిద్ధం చేసిన పీసీబీ..

అంతేకాకుండా.. తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అని మీరు కోరుకుంటే అవుతానన్నారు. పురోహుతికా అమ్మ వారు డిప్యూటీ సీఎం అవ్వమన్నారని తెలిపారు. తమ దగ్గర అల్లా ఉద్దీన్ అద్భుత ద్వీపం లేదు.. కొంచెం సమయం కావాలన్నారు. ఏపీకి నిధులు తెచ్చే బాధ్యత తాను, సీఎం చూసుకుంటామని తెలిపారు. మరోవైపు.. పదవి ఉన్న లేకపోయినా తాను రాజా లానే ఉంటానని చెప్పారు. తనకు మీ గుండెల్లో ఇచ్చిన స్థానం.. చివర శ్వాస వరకు గుర్తు పెట్టుకుంటానన్నారు.
పిఠాపురం నుంచి పోటీ చేయాలని తాను అనుకోలేదు.. మీకు రుణ పడి ఉంటానని తెలిపారు.

Chicken Biryani : బిర్యానీ ఆర్డర్ చేస్తే.. మంచూరియా ఇచ్చిన సిబ్బంది.. ఇదేమని అడుగుతే దంపతులపై దాడి..

2029కి కాదు 2028 కి పోటీ చేయడం వేస్ట్ అనిపించేలా అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. తనకు మూడు నెలలు సమయం కావాలని అన్నారు. మరోవైపు.. గత ప్రభుత్వంలో ఉన్న మందు అమ్ముతున్నారా? కొల్లు రవీంద్రను అడగాలన్నారు. కొత్త మద్యం విధానం రావాల్సి ఉందని తెలిపారు. ఇదిలా ఉంటే.. పిఠాపురంలో పార్టీ ఆఫీస్ కి స్థలం తీసుకున్నాను.. పిఠాపురం దేశానికి రోల్ మోడల్ అవ్వాలని చెప్పారు. జనసేన ఇప్పుడు గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.