NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ కీలక నిర్ణయం.. నా జీతం కూడా వదిలేస్తున్నా..

Pk

Pk

Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కలయాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జీతం కచ్చితంగా తీసుకుంటా.. అప్పుడే జవాబుదారి తనం ఉంటుంది.. అందరూ ప్రశ్నించడానికి ఉంటుందన్న పవన్.. ఇప్పుడు.. తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్న ఆయన.. గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖలో మంత్రిగా జీతం తీసుకోవాలని అనుకున్నాను.. కానీ, ఈ శాఖలో జరిగిన అవినీతి కారణంగా రూపాయి నిధులు కూడా లేవు.. అందుకే నా జీతం కూడా వదిలివేశా అని ప్రకటించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటిసారి వచ్చా పిఠాపురానికి గెలిచిన వెంటనే పనిలోకి దిగాను.. మంత్రిత్వ శాఖల పట్ల అవగాహన కలిగించుకుని ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేశాను అన్నారు..

Read Also: Pawan Kalyan: పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. కీలక వ్యాఖ్యలు

ఇక, లబ్ధిదారులకు అందజేస్తున్నా సంక్షేమ పథకాలను రీ సర్వే చేపడతాం అని ప్రకటించారు పవన్‌ కల్యాణ్‌.. ప్రజలకు పని చేసి మన్ననలు పొందిన తరువాతే విజయోత్సవం చేసుకుంటాను అన్నారు.. పిఠాపురం నియోజకవర్గంలోని మోడల్ విలేజ్ లుగా చేస్తా.. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా పరిపాలనను ముఖ్యమంత్రి చంద్రబాబు గాడిలో పెడతాను అని వెల్లడించారు. రాజకీయాలకు డబ్బులకు సంబంధంలేదు.. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే పనులు అన్ని చిటికెలో చేస్తారని కోరుకుంటారు.. చిటికెలో పని జరిగేలా కృషి చేస్తాను అన్నారు డిప్యూటీ సీఎం.. వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 వేలు పెన్షన్ ఇచ్చి 300 కమీషన్ తీసుకునే వారు అని ఆరోపించారు. ఇలా జరగకుండా కూటమి ప్రభుత్వం చూస్తుంది.. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ ఇంటింటికీ పంపిణీ చేయడం సాధ్యం కాదన్నారు.. ఇది నిజం కాదని.. ఈవేళ ప్రభుత్వ సిబ్బందితో పంపిణీ చేసి రుజువు చేశాం అన్నారు పవన్.

Read Also: Darshan : కన్నడ హీరో దర్శన్ మర్డర్ కేసుపై సినిమాలు.. టైటిల్స్ ఏంటో తెలుసా ?

ప్రభుత్వ వ్యవస్థలు అన్ని నిర్విర్యం అయ్యాయి.. ప్రభుత్వ వ్యవస్థలు అన్నింటినీ గాడిలో పెడతాం అన్నారు పవన్‌.. నా ఐదేళ్ల పాలనలో రక్షిత మంచినీటి పథకం లేని గ్రామం ఉండకుండా చేయాలన్నదే లక్ష్యం.. గిరిజన మారుమూల ప్రాంతాల్లో అనారోగ్యం బారినపడిన వారిని డోలుపై మోసుకుని రాకుండా సౌకర్యాలు కల్పించాలని ఉందన్నారు. ఇక, పిఠాపురంలో సొంత ఇల్లు నిర్మించుకుంటా.. ఇల్లు కట్టుకోవడానికి స్థలం కోసం వెతుకుతున్నాను అని తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.