NTV Telugu Site icon

Pawan Kalyan: రోడ్డు ప్రమాదంలో అభిమానులు మృతి.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్

Pawan

Pawan

గేమ్ ఛేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన చరణ్, మణికంఠ ప్రమాదానికి గురైన మరణించిన విషయం తెలిసిందే. రంగంపేట మండలం ముకుందవరం గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతాన్ని తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పిఠాపురం పర్యటనకు వెళ్తున్న ఆయన మార్గ మధ్యలో ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీశారు. ప్రమాదానికిగల కారణాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

READ MORE: Electricity Bill: ఓరి దేవుడా ఆ వ్యాపారికి ఏకంగా రూ. 210 కోట్ల కరెంట్ బిల్లు..

మరోవైపు.. పిఠాపురం పర్యటనకు వెళ్తూ రామస్వామిపేట వద్ద ఏడీబీ రోడ్డు నిర్మాణం పనులు పరిశీలించారు. రోడ్డు నిర్మాణం ఎప్పుడు ప్రారంభం అయ్యింది. ఎంత వరకు పూర్తయ్యింది? ప్రస్తుతం పనులు ఎలా సాగుతున్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు వెంట కాలి నడకన వెళ్తూ డ్రెయిన్ సౌకర్యం, నిర్మాణం పనుల్లో నాణ్యతను పరిశీలించారు. కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి, ఇతర ఉన్నతాధికారులు ఆయన వెంట ఉన్నారు.

READ MORE: Bollywood : బాలీవుడ్ లో అత్యంత ఖరీదైన విడాకులు ఎవరివో తెలుసా..?

ఇదిలా ఉండగా.. రాజమహేంద్రవరం శివారున ఈ నెల 4వ తేదీన రాంచరణ్‌ నటించిన గేమ్‌ఛేంజర్‌ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు హాజరై తిరిగివెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కాకినాడకు చెందిన ఎ.మణికంఠ, టి.చరణ్‌ల కుటుంబ సభ్యులను ఇటీవల సినీ నిర్మాత దిల్‌ రాజు తరపున ప్రతినిధుల బృందం పరామర్శించింది. మైత్రి ఫిలింస్‌ తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు ఉదయ్‌రాజు, రాయుడు, లైన్‌ ప్రొడ్యూసర్‌ కాకినాడ బాబీ, సినీ నిర్మాత మల్లిడి సత్యనారాయణరెడ్డి, జనసేన జగ్గంపేట ఇన్‌ఛార్జి తుమ్మలపల్లి రమేష్‌ తదితరుల చేతుల మీదుగా ఇరు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందించారు.

READ MORE: Gold Rate Today: వరుసగా మూడోరోజు బాదుడే.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?

Show comments