ఇండస్ట్రీ ఏదైనప్పటికి విడాకులు, బ్రేకప్‌లు కామన్ అని చెప్పాలి. ఎంతో గ్రాండ్ గా కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేసుకున్న హీరో, హీరోయిన్లు, పట్టుమని పది నెలలు కూడా కాకముందే విడిపోతున్నారు. అలా విడిపోయిన జంటలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. మరి కొంత మంది హీరోలు తమ వైఫ్ లకు డబ్బులు ఇచ్చి మరి వారి నుండి విడిపోయారు. బ్లాక్ అండ్ వైడ్ సినిమాల రోజుల నుండి ఇప్పటి పాన్ ఇండియా సినిమాల కాలం వరకు ఎందరో సినీ జంటలు విడాకులు తీసుకున్నారు.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
ఈ కల్చర్ బాలీవుడ్ లో కాస్త ఎక్కువ. నచ్చినన్నీ రోజులు కలిసి కాపురం చేయడం కుదరని పక్షంలో విడాకులు తీసుకోవడం కామన్. ఇప్పటి బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ ఈ లిస్ట్ లో ఉన్నారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన విడాకులు తీసుకుంది బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, ఆయన మాజీ సతీమణి సుస్సానే ఖాన్ అనే టాక్ బీ టౌన్ లో కోడై కూస్తుంది. ఎలాంటి హింట్ ఇవ్వకుండా కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే హృతిక్ ప్రేయసి సుస్సానేని పెళ్లి చేసుకునాడు. వీరిద్దరికీ రెహాన్, రిధాన్ అనే ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు. ఏం జరిగిందో తెలీదు కాని పెళ్ళి అయి దాదాపు 14 ఏళ్ల తర్వాత వీరిద్దరు డివోర్స్ తీసుకున్నారు. అయితే హృతిక్ ని రూ. 400 కోట్లు ఇవ్వాలని సుస్సానే డిమాండ్ చేసింది. కానీ చివరకు రూ. 380 కోట్లు చెల్లించేందుకు అంగీకరించాడట హృతిక్. దీంతో ఇండస్ట్రీ లోనే అత్యంత ఖరీదైన విడాకులు తీసుకున్న జంటగా ఈ జంట నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ ఇద్దరు తమ పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తున్నారు.