NTV Telugu Site icon

Pawan Kalyan: శ్రీవారి లడ్డూ వివాదంపై పవన్‌ కల్యాణ్ ఫస్ట్ రియాక్షన్..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారిగా స్పందించారు. శ్రీవారి లడ్డూ కల్తీ గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు ఆయన అన్నారు. స్వచ్ఛమైన నెయ్యి ధర ఎక్కువ ఉంటుందన్న పవన్‌ కల్యాణ్‌.. తక్కువ ధరకు వస్తుందని ఎలా కొంటారని గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా దేవాలయాలకు సంబంధించిన సమస్యలను పరిశీలించేందుకు ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ను ఏర్పాటు చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం కోరారు. తిరుమలలో కొనసాగుతున్న లడ్డూ వివాదంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయం దేవాలయాల అపవిత్రత, దాని భూ సమస్యలు, ఇతర ధార్మిక పద్ధతుల చుట్టూ ఉన్న అనేక సమస్యలను సూచిస్తుందన్నారు.

Read Also: CM Chandrababu: దీపావళికి ఆడబిడ్డలకు ఉచిత గ్యాస్.. అన్నీ హామీలను నెరవేరుస్తాం..

చాలా ప్రశ్నలకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు సమాధానం చెప్పాలన్నారు. మొత్తం భారతదేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించడానికి జాతీయ స్థాయిలో ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ని ఏర్పాటు చేయవలసిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ విషయంపై జాతీయ స్థాయిలో చర్చకు పిలుపునిచ్చారు. సనాతన ధర్మాన్ని ఏ రూపంలోనైనా అపవిత్రం చేయడానికి వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడాలని కోరారు. లడ్డూ ప్రసాదంపై ప్రజల నుంచి ఫిర్యాదు అందాయని.. ల్యాబ్‌ పరీక్షలు చేయించాలని చాలా మంది ఫిర్యాదు చేశారన్నారు. ప్రజల మనోభావాలు గౌరవించకుండా ఆలయ పవిత్రతను దెబ్బతీశారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రజల మనోభావాలతో ఎవరూ చెలగాటమాడితే సహించబోమని ఆయన హెచ్చరించారు.