Kadapa: డిప్యూటీ సీఎం ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం.. విచారణ వేగవంతం
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం
- సింహాద్రిపురం మండలంలోని దిద్దేకుంట గ్రామాన్ని పరిశీలించిన ఆర్డీఓ
- నాగేంద్ర కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ప్రదేశాన్ని పరిశీలించిన ఆర్డీఓ
- నాగేంద్ర కుటుంబ సభ్యులను చంపి ఆత్మహత్య చేసుకున్న నాగేంద్ర
- ఈ కేసులో 8 మందిని విచారించిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికార యంత్రాంగం విచారణ వేగవంతం చేసింది. సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో నాగేంద్ర అనే రైతు అప్పుల బాధ తాళలేక తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. నిన్న రిమ్స్ హాస్పిటల్‌లో ఎంపీడీవో జవహార్ బాబును పరామర్శించడానికి వచ్చిన డిప్యూటీ సీఎం దృష్టికి రైతు ఆత్మహత్య ఘటన వచ్చింది.
Read Also: Pawan Kalyan: నితీష్ కుమార్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం ప్రశంసల వర్షం..
Also Read
ఈ ఘటన పై ఆయన విచారం వ్యక్తం చేశారు. రైతు కుటుంబం మృతికి గల కారణాలను విచారణ చేసి.. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు పులివెందుల ఆర్డీఓ ఘటన స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలపై ఆరా తీశారు. నాగేంద్రకు అప్పు ఇచ్చిన ఎనిమిది మందిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే నాగేంద్ర మృతి చెందిన రోజు ఆయనకు 22 సార్లు ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటి వరకు నాగేంద్ర కుటుంబానికి 15 లక్షల రూపాయలు అప్పు ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది.
Read Also: Manmohan Singh Cremation: పీవీకి మీరు చేసింది ఏమిటి..? కాంగ్రెస్‌వి చిల్లర రాజకీయాలు..
కాగా.. నిన్న (శనివారం) దిద్దేకుంట గ్రామంలో అప్పుల బాధ తాళలేక రైతు నాగేంద్ర దారుణానికి ఒడిగట్టాడు. భార్య, పిల్లలను చంపి తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. మొదట భార్య వాణిని స్కూటర్ పై పొలం వద్దకు తీసుకెళ్లి తాడుతో గొంతు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత కొడుకు, కూతురును అదే విధంగా చంపేశాడు. కుటుంబ సభ్యులను హత్య చేసిన తర్వాత అదే తాడుతో ఆత్మహత్య చేసుకున్నాడు. కౌలుకు తీసుకుని పంటల సాగు చేసి అప్పుల పాలు కావడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.
తాజావార్తలు
-
Jackky Bhagnani: హీరోయిన్ రకుల్‌తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్‌లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
-
Munna Bhaiya: ‘మున్నాభయ్య’ ఈజ్ బ్యాక్.. దివ్యేందు శర్మ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
-
Bhagyashri Borse: హిట్లతో పనిలేదు.. టాలీవుడ్‌ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా!
-
Trump: ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ కునుకు.. వీడియో వైరల్
-
Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్‌గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు – అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!