Bhatti Vikramarka: మహా శివరాత్రి వేడుకల్లో డిప్యూటీ సీఎం.. చిన్న నాటి మిత్రులతో కలసి..!
- మహా శివరాత్రి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి
- స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో శివపార్వతులకు పూజ
- జాతరలో చిన్ననాటి మిత్రులతో భట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రజలు సబీక్షంగా ఉండాలని, ప్రపంచంలో తెలుగు ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని ఆ శివపార్వతులను వేడుకున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా బుధవారం ఆయన శ్రీమతి మల్లు నందినితో కలిసి స్వగ్రామమైన వైరా మండలం స్నానాల లక్ష్మిపురంలోని పురాతన శివాలయంలో, మధిర నియోజకవర్గ కేంద్రంలోని శివాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
మహా శివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ కుటుంబం పేరిట దేవాలయాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూజలు చేయించారు. ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి శివపార్వతుల ఆశీస్సులు ఉండాలని పూజలు నిర్వహించారు. స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో శివపార్వతుల పూజ అనంతరం జాతరలో పాల్గొన్నారు. జాతరలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో చిన్ననాటి మిత్రులతో కలిసి డిప్యూటీ సీఎం కలియతిరిగారు. మిఠాయిలు కొనుగోలు చేసి.. మిత్రులకు పంచుతూ ఆనందంగా గడిపారు.
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
మహాశివరాత్రి సందర్భంగా స్వగ్రామం స్నానాల లక్ష్మిపురంలో శివపార్వతుల ఆలయంను సందర్శించి సతీసమేతంగా స్వామివారికి పూజలు చేయడం జరిగింది.#MahaShivaratri pic.twitter.com/flOcZDGaTO
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) February 26, 2025
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!