NTV Telugu Site icon

CM Wife Song: ‘నే పాడితే లోకమే పాడదా.. నే ఆడితే లోకమే ఆడదా’ అంటున్న డిప్యూటీ సీఎం భార్య

Pednavis

Pednavis

CM Wife Song: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్‌కు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. ఆమె గతంలో ఎన్నో వినసొంపైన పాటలను పాడారు. అమృత ఫడ్నవీస్ గొప్ప గాయనిగా పరిచయం. ఆమె పాడిన ‘మూడ్ బనా లియా’ పాట ఇటీవల విడుదలైంది. ఈ పాటలో ఆమె డ్యాన్స్ కూడా చేసింది. ఈ పాట విడుదలైన ఒక్కరోజులోనే పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అమృత ఫడ్నవీస్ పాట ‘మూడ్ బనా లియా’ టి సిరీస్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదలైంది. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే కొందరు అమృతా ఫడ్నవీస్‌ను కూడా ట్రోల్ చేశారు. అయితే ‘మూడ్ బనా లియా’ చూసిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ స్పందన ఏమిటో అమృత తెలిపింది.

Read Also: Tamannaah Beauty Secret : తన అందాల రహస్యం చెప్పిన తమన్నా

ఈ పాటను అమృత ఫడ్నవీస్‌ విడుదల చేసే సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ ‘మూడ్ బనా లియా’ చూశారా? అని కొందరు ప్రశ్నించారు. అప్పుడు “అవును, చూశారు. వారు పాటను ఇష్టపడ్డారు. ” అమృత మాట్లాడుతూ, “ ట్రోలింగ్‌కు భయపడట్లేదు.. కానీ అన్ని పాటలు అందరికీ ఇష్టం కావు.. ప్రస్తుతం ఉన్నత స్థానంలో ఉన్నారు… కాబట్టి సగం జనాభా నుంచి ట్రోలింగ్స్ వస్తూనే ఉంటాయని సమాధానమిచ్చారు. అమృత పాటలు కొన్ని ఇంతకు ముందు విడుదలయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ఆమె పాటలకు విశేష స్పందన లభించింది. అంతేకాదు ట్రోలింగ్‌ను కూడా ఎదుర్కొన్నారు. ఆమె పాడిన ‘వో తేరే ప్యార్ కా ఘమ్’, ‘శివ తాండవ్ శరతం’, ‘తేరీ మేరీ ఫిర్ సే’, ‘బేటియా’ వంటి పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Show comments