NTV Telugu Site icon

Deputy CM: కేసీఆర్ ను పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Batti

Batti

Deputy CM: సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎంకేసీఆర్‌ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అయితే, తుంటి ఆప‌రేష‌న్ సక్సెస్ అయిందని.. వేగవంతంగా కేసీఆర్ కోలుకుంటున్నార‌ని వైద్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి తెలియజేశారు. సాధ్యమైనంత తర్వలో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు వెల్లడించారు. అనంత‌రం కేసీఆర్ తో భట్టి కాసేపు మాట్లాడారు.. అలాగే అక్కడే ఉన్న కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కల్వకుంట్ల కవితతో కలిసి ప్రమాదం జరిగిన తీరును, చికిత్స అందిస్తున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఎన్టీవీ ఛైర్మన్ నరేంద్ర చౌదరి కూడా కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో క్షేమంగా తిరిగిరావాలని ఆకాంక్షించారు.

Read Also: Akkineni Nagarjuna: రెండు లక్షల టీ షర్ట్ రా.. ఎలా ఇచ్చేస్తాడు.. ఆశకు అయినా హద్దు ఉండాలి

ఇక, అంతకు ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై త్వరలోనే శ్వేత పత్రం రిలీజ్ చేస్తామని వెల్లడించారు. 2014కు ముందు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు, 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక పరిస్థితులపై శ్వేత పత్రం సిద్ధం రెడీ చేస్తున్నామని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఆత్మ గౌరవం కోసం తెలంగాణ సమాజం కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకుంది అని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. పది ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చక పోగా ఉన్న స్వేచ్ఛని సైతం హరించింద‌ని భట్టి విక్రమార్క విమర్శించారు.

Show comments