Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల విషయం పక్కన పెడితే.. నాగ్ స్టైల్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా బిగ్ బాస్ లో నాగ్ డ్రెస్సింగ్ స్టైల్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ప్రతి వారం.. నాగ్.. ఫ్యాషన్ ఐకాన్ లా కనిపించడం.. ఇక తెల్లారితే ఆ డ్రెస్ ల గురించి సోషల్ మీడియాలో చర్చలు జరగడం కామన్ గా మారిపోయింది. అయితే.. నాగ్ వేసుకొనే డ్రెస్ ల రేటు తెలుసుకొని షాక్ అవ్వడం కూడా జరుగుతుంది. ఒక్కో షర్ట్ లక్షల్లో ఉండడంతో.. వామ్మో మనం కొనలేములే అని వదిలేస్తున్నారు. అలాంటి డ్రెస్ లు కొనాలంటే.. సాధారణ ప్రజలకే కాదు.. బిగ్ బాస్ హౌస్ లో ఉండే కంటెస్టెంట్ ల వలన కూడా కాదు. ఇక ఒక్కోసారి నాగ్ డ్రెస్ లు నచ్చి.. కంటెస్టెంట్స్ ఆ డ్రెస్ కావాలని అడగడం.. కొన్నిసార్లు నాగ్ ఇస్తానని చెప్పడం చూస్తూనే ఉంటాం.
ఇక తాజాగా నిన్న ఆదివారం నాగ్ వేసుకున్న టీ షర్ట్ గురించి సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తోంది. ఎల్లో కలర్ స్వెట్ టీ షర్ట్ పై బ్లాక్ కలర్ క్రిస్టమస్ ట్రీ ఉంది. చూడడానికి చాలా బావుందని అమర్.. ఆ టీ షర్ట్ కావాలని అడిగాడు. దానికి శివాజీ ఆశకు ఒక హద్దు ఉండాలి అని అన్నాడు. నాగ్ కూడా దాని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఆ టీ షర్ట్ విలువ అక్షరాలా.. రెండు లక్షలు. డియోర్ బ్రాండ్ కు చెందిన ఈ స్వెట్ టీ షర్ట్ విలువ చూసి.. అభిమానులు షాక్ అవుతున్నారు. శివాజీ ఆ మాట అనడంలో తప్పే లేదురా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.