NTV Telugu Site icon

Deputy CM Bhatti Vikramarka: పదేళ్లో ఓ లెక్క.. ఇప్పుడో లెక్క.. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా

Bhatti Vikramarka

Bhatti Vikramarka

గత పది సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని.. ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నిమిషం కూడా వృథా చేయమన్నారు. ఎర్రుపాలెం మండలం జములాపురంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. జములాపురాన్ని రాష్ట్రానికి ఒక పర్యాటక కేంద్రంగా మార్చే ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. “ఎనిద్రం చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులు రెండు రోజులపాటు జమలాపురంలో గడిపేలా ప్రణాళికలు సిద్ధం చేశాను. జములాపురం టూరిజం ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ.. గత 15 పాలకుల అలసత్వం వల్ల అభివృద్ధి జరగలేదు. జమలాపురం చెరువు అహ్లాదకరంగా ఉండేలా అనుమతులు మంజూరు చేశాం. త్వరలో పనులకు శంకుస్థాపన చేస్తాను. నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుంచి అధికారికంగా తూము ఏర్పాటు చేయించి జమలాపురం చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా మారుస్తా. ఎరుపాలెం మండలం మొత్తాన్ని సాగర్ మూడవ జోన్ నుంచి రెండవ జోన్ లోకి మార్చి మండలంలో ఎక్కడ సాగు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతా. రెండో జోన్లో మార్చేందుకు అవసరమైన సర్వేలు, మ్యాపులు, ప్రభుత్వానికి సమర్పిస్తున్నారు. త్వరలోనే జీవో విడుదల అవుతుంది. ఇందుకుగాను బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయించాం.” అని స్పష్టం చేశారు.

READ MORE: Samantha: ఆ ప్రశ్నకు షాకయిన సమంత.. దెబ్బకు ముఖకవళికలు మారిపోయాయ్!

ఎర్రుపాలెం మండలం మొత్తం రోడ్లు వేసి ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా రహదారులు నిర్మిస్తామని.. మండలం మొత్తం ఒక రింగ్ రోడ్డులా అభివృద్ధి చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. కట్టలేరు ఆధునికీకరనకు నిధులు మంజూరు చేశామన్నారు. మధిర నియోజకవర్గం ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానన్నారు. ఆర్థిక, విద్యుత్ , ప్రణాళిక శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు స్వీకరించానని తెలిపారు. మీరిచ్చిన అవకాశంతో ఆర్థిక మంత్రిగా రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయగలిగానని తెలిపారు. నాకు మీరు వేసిన ఓటు విలువను పెంచారన్నారు.