తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో వివిధ శాఖల సమీక్ష సమావేశం ఆయన నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా, ఆరోగ్యశ్రీ విభాగాల పనితీరును సమీక్షించారు. ఈ సమావేశంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో భాగంగా గత 2 ఆర్థిక సంవత్సరాల ప్రగతిని సమీక్షించారు. ఆ తర్వాత బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి 2 నెలలు కనబరిచిన పనితీరును సమీక్షించి వివిధ శాఖల్లో పనితీరు మెరుగుపరచుకోవడానికి యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుని ఏటువంటి లీకేజీలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆయన ఆదేశించారు.
Renu Desai: నా హృదయం నిండిపోయింది.. కళ్ళు మెరిసిపోయాయి.. రేణు దేశాయ్ ఎమోషనల్
ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని పటిష్టపరిచి బడ్జెట్ అంచనాలను అందుకోవాలని ఆయన తెలిపారు. ఆదాయం పెంచుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖలో వేసిన కమిటీ పనితీరును డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు కమర్షియల్ టాక్స్ విభాగాల్లో తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం వివిధ బ్యాంకులు, సంస్థలకు చెల్లిస్తున్న రుణాల వడ్డీ రేటును సమీక్ష చేసుకొని, తక్కువ వడ్డీ రేటు ఇచ్చే సంస్థలకు రుణాలు బదలాయింపు చేసుకుని ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆదేశించారు.
ఈమధ్య సింగరేణిలో చేసిన ఈ ప్రయోగం ద్వారా వందల కోట్ల ప్రయోజనం చేకూరిన విషయాన్ని ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులకు వివరించారు. LRS దరఖాస్తులు సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నాయని, ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఈ ప్రక్రియ ప్రారంభమైన ప్రగతి లేకపోవడానికి కారణాలు డిప్యూటీ సీఎం ఆరా తీశారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చాలని కోరారు. పూర్తిగా అర్హత ఉన్న స్థలాలకే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (LRS) అమలు చేయాలని, ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఈ పథకం కింద ప్రయోజనం పొందే ప్రమాదం పొంచి ఉందని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. హౌసింగ్ బోర్డ్, రాజీవ్ స్వగృహ పథకాల ద్వారా నిర్మించిన ఇల్లు, వచ్చిన ఆదాయం వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Car Accident: టోల్ గేట్ ఉద్యోగి పైకి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్..
ఇప్పటికీ విక్రయించని ఇల్లు, ఇళ్ల స్థలాలు వాటి పరిస్థితిని ఆయన సమీక్షించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా సామాన్యుడు సంతృప్తి చెందడమే ప్రధాన లక్ష్యమని అధికారులకు సూచించారు. ఆరోగ్యశ్రీ బకాయిలను నెలవారి చెల్లించే పద్ధతిని ఆచరణలో పెడుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అమలు చేస్తున్న ప్యాకేజీల ధరలకే ప్రైవేటు ఆసుపత్రిలో ఆయా చికిత్సలు అందించేందుకు వారిని ఒప్పించాలని, ఈ పథకం సామాజిక బాధ్యతలో భాగమని వారికి వివరించాలని, వారితో చర్చలు జరపాలని డిప్యూటీ సీఎం అధికారులను కోరారు.