Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Deputy Cm Bhatti Vikramarka Meeting Over Mission Bhageeratha

Bhatti Vikramarka : మిషన్ భగీరథ కార్మికుల వేతనాల పై సమగ్ర నివేదిక ఇవ్వండి

Published Date :July 3, 2024 , 5:39 pm
By Gogikar Sai Krishna
Bhatti Vikramarka : మిషన్ భగీరథ కార్మికుల వేతనాల పై సమగ్ర నివేదిక ఇవ్వండి
  • Follow Us :
  • google news
  • dailyhunt

మిషన్ భగీరథ పథకం కింద 42 వేల కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలోని 1150 ఆవాసాలకు 50 శాతం నీళ్ళు సరఫరా చేస్తున్నామని ప్రస్తుతం చెబుతున్నారు.. ఇదే పథకం కింద రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. నీటి ఎద్దడి లేదని సర్పంచుల సంతకాలతో గతంలో అసెంబ్లీలో ప్రకటించారు. కేంద్రానికి నివేదిక పంపారని, అంటే ఆనాటి ప్రకటన బోగస్ అని భావించాలా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ప్రశ్నించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో 23,824 ఆవాసాలు ఉండగా 1156 ఆవాసాల్లో 50 శాతం మాత్రమే నీళ్లు ఇవ్వగలుగుతున్నాం అంటున్నారు, ఆలేరు, భువనగిరి, నల్గొండ నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందడం లేదు నిధులు కావాలని మీ శాఖ నుంచే ఫైల్ రావడం ఏంటని డిప్యూటీ సీఎం మిషన్ భగీరథ అధికారులను ప్రశ్నించారు. మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి సరఫరా పై ప్రస్తుతం జరుగుతున్న సర్వే, అది ఎప్పుడు పూర్తవుతుంది తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వే పూర్తికాగానే రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలకు ఆ నివేదికలు అందజేసి… తాగునీరు అందుతుందన్న విషయాన్ని వారి ద్వారా నిర్ధారణ చేసుకోవాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.

42 వేల కోట్లు ఖర్చు చేసిన ఇంకా తాగునీటి ఎద్దడి ఉందని కొత్తగూడెం, ఆలేరు అంటే నియోజకవర్గాల్లో అదనపు నిధులు కోరుతున్నారు.. ఇదేంటని ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీలకు హైదరాబాద్ మెట్రో నుంచి తాగునీటిని సరఫరా చేస్తుండగా ఆయా మున్సిపాలిటీలు మిషన్ భగీరథ కింద మంచి రెడ్డి సరఫరా చేస్తున్నట్టు రికార్డుల్లో ఎందుకు చూపిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. తాగునీటి సరఫరా కి ప్రధాన సోర్స్ ను వందల కిలోమీటర్ల నుంచి కాకుండా ప్రతి సమీపంలో నుంచి తీసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి తీసుకోవడం మూలంగా తరచూ పైప్ లైన్ లు పగిలిపోవడం వంటివి ఉత్పన్నమై తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. మిషన్ భగీరథ పథకం కింద పనిచేస్తున్న సిబ్బంది జీవితాలు నెలల తరబడి ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయి అని ప్రశ్నించారు.

ఒక్కో ప్రాంతంలో ఒకరకంగా కార్మికుల వేతనాలు ఉంటున్నాయి, 8000 నుంచి 13 వేల వరకు అందుతున్నట్టు నాకు సమాచారం ఉంది. ప్రభుత్వం అందిస్తున్న వేతనాల నిధుల్లో ఎక్కువ మొత్తం ఏజెన్సీలు కట్ చేసుకుని మిషన్ భగీరథ కార్మికులకు తక్కువ జీతాలు ఇస్తున్నారు దీనిపై సమీక్ష చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న వేతనాలు కార్మికులకు ప్రయోజనం చేకూర్చాల తప్ప మధ్య భక్తులకు కాదని అన్నారు. రాష్ట్రంలో మొత్తం ఉన్న ఏజెన్సీలు ఎన్ని, ప్రభుత్వం ఇస్తున్న వేతనాలు, ఏజెన్సీలు కార్మికులకు ఇస్తున్న వేతనాల వివరాల తో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ కార్మికులకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకంగా వేతనాలు ఉండేలా ఫిక్స్ చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పథకం కోసం చేసిన వేల కోట్ల అప్పు చెల్లిస్తున్న పథకం ప్రయోజనం పూర్తిస్థాయిలో నెరవేరడం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమాలు అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • Deputy CM Bhatti Vikramarka
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions