NTV Telugu Site icon

Bhatti Vikramarka: బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను సరిదిద్దుతున్నాం..

Bhatti Vikramarka

Bhatti Vikramarka

ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో కాంగ్రెస్ సభ నిర్వహించారు. ఈ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో స్వేచ్ఛ లేని పరిస్థితికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుని వచ్చిందని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశాను.. పాదయాత్ర ద్వారా ఉద్యమం చేశాను.. మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం కోసం కృషి చేశానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో మాట్లాడితే కేసులు ఉండేవని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనను ఉప ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని చెప్పిందని అన్నారు. ప్రతి పైసా రాష్ట్ర ప్రజల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తానని భట్టి విక్కమార్క చెప్పారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ అజెండా అని అన్నారు. టీఆర్ఎస్ మాయ మాటలతో అధికారంలోకి వచ్చింది.. రాష్ట్రాన్ని అగమ్య గోచరంగా చేసిందని దుయ్యబట్టారు. సంపద అంతా కొద్ది మంది చేతుల్లోకి వెళ్లేలా చేసిందని మండిపడ్డారు.

Konda Vishweshwar Reddy Face To Face: తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే పోటీ..

రాష్ట్రాన్ని సాఫ్ట్ వేర్ ద్వారా మరింతగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది.. జీతాలు ఇవ్వలేని దుస్థితి నుంచి మొదటి తేదీ జీతాలు ఇచ్చే విధంగా చేశామన్నారు. కాంగ్రెస్ వల్ల ఏమౌతుంది అన్నారు.. ఏమి చేస్తామో చేసి చూపిస్తామని తెలిపారు. కాంగ్రెస్ వచ్చింది.. చర్ణకొలాతో కొట్టినట్లుగా రైతుంబందును ఫేస్ ల వారీగా ఇస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను సరిదిద్దుతున్నామని చెప్పారు. ప్రతి మంత్రి అహర్నిశలు కష్టపడుతున్నారు.. దేశంలోనే ఆదర్శ వంతమైన పాలన తెలంగాణలో ఇస్తామని భట్టి తెలిపారు. మరోవైపు.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లొసుగులను తొలగిస్తున్నాం.. మేధస్సు వృదా పోకుండా చేస్తాం.. చదువు సమాజానికి ఉపయోగపడాలని మంత్రి పేర్కొన్నారు.

Vice Chancellors: తెలంగాణలోని 10 వర్సిటీలకు వీసీల నియామకం.. నోటిఫికేషన్ విడుదల

టీఆర్ఎస్ నాయకత్వం పదేళ్లుగా హామీలను అమలు చేయలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. పది రోజులు కాకముందే బట్టలిప్పి కొడతామని అంటున్నారు.. పదేళ్లు మిగులు బడ్జెట్ మీ చేతిలో పెడితే ఏం చేశారని ప్రశ్నించారు. బట్టలిప్పి కొడతా అంటే కాంగ్రెస్ కార్యకర్తలు చేతులు ముడుచుకొని కూర్చోలేదు.. ప్రతిపక్షాన్ని గౌరవించాలని మర్యాదగా మీతో ఉన్నాం.. మమ్ములను చేతకాని తనంగా చూడవద్దని భట్టి విక్రమార్క సూచించారు. అదే స్థాయిలో సమాధానం చెప్తాం.. కాళేశ్వరం అట్లా అయింది, మిషన్ భగీరథ ఇట్లా అయ్యింది.. అన్నింటినీ సరి చేయడానికి కొంత కాలం పడుతుందన్నారు.
మరియమ్మ మీద అకృత్యానికి కట్టడి పోరాడి కట్టడి చేశామని తెలిపారు. చింతకాని నుంచే పోలీసుల పై ఉద్యమాలు చేశామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.