NTV Telugu Site icon

Deputy CM: సుంకిశాల ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు భట్టి విక్రమార్క కౌంటర్..

Ktr, Bhatti

Ktr, Bhatti

సుంకిశాల ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఎటాక్ చేశారు. సుంకిశాలకు సంబంధించిన ఘటనలో పొరపాటును ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి.. కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడం సరికాదని అన్నారు. సుంకిశాల ఘటనతో కృష్ణా నదిపై బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల నాణ్యత పై విచారణ చేయిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కాళేశ్వరం, సుంకిశాల ప్రాజెక్టులను నిర్మించారని.. నీళ్లు రాకుండానే కాళేశ్వరం కుంగిపోయిందని పేర్కొన్నారు. నీళ్లు వచ్చిన తర్వాత సుంకిశాల ప్రాజెక్టు మునిగిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు అక్కడ కట్టడం సరికాదని కాంగ్రెస్ ముందే చెప్పిన వినకుండా.. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది.. ఫలితం ఏంటో ఇప్పుడు అందరం చూస్తున్నామన్నారు.

Hit and run: మహారాష్ట్రలో మరో హిట్ అండ్ రన్ కేసు.. కారు ఢీకొని యువకుడి మృతి

ఇంజనీర్లు చెప్పింది కాదని.. కేసీఆర్ సొంత నిర్ణయాలు తీసుకొని కాళేశ్వరం కట్టడం వల్లే కుంగుబాటుకు కారణమైందని భట్టి విక్రమార్క తెలిపారు. ఇంజనీర్లు చేయాల్సిన పని ఇంజనీర్లు చేయాలి.. కానీ, ఇంజనీర్లు చేయాల్సిన పనిని కేసీఆర్ చేయడం వలనే మేడిగడ్డ కుంగిపోయిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రాజెక్టు నాణ్యత లోపాల అవినీతిని ఎప్పుడు బయటపెట్టాలని చూస్తున్న తమకు సుంకిశాల ఘటనను దాచి పెట్టాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులకు రీ డిజైన్ చేసి ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని తెలిపారు. రూ. 1450 కోట్లతో పూర్తయ్యే రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టుగా పేరు మార్చి.. రూ. 23 వేల కోట్లకు అంచనాలు పెంచి రాష్ట్ర ఖజానాను బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ చేసిందని మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టుపై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎకరానికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదని పేర్కొన్నారు.

Uttam Kumar Reddy: దక్షిణ తెలంగాణను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది..

హైదరాబాద్ సరూర్ నగర్లో జరిగిన బహిరంగ సభలో ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సైతం ప్రస్తావించారని డిప్యూటీ సీఎం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్టు పై పెట్టిన ఖర్చు వృధా కాకుండా ఉండడానికి.. ముఖ్యమంత్రి భద్రాచలం పర్యటనకు వచ్చినప్పుడు ఇంజనీర్లతో కలిసి రాజీవ్ గాంధీ లింకు కెనాల్ ను ప్రతిపాదించామన్నారు.
కేవలం 75 కోట్ల రూపాయలతో రాజీవ్ లింకు కెనాల్ ను మూడు నెలల్లో పూర్తి చేసి ఒక లక్ష 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం చేపట్టామని భట్టి విక్రమార్క తెలిపారు. మూడు నెలల్లో రాజీవ్ లింకు కెనాల్ కాలువను పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనం అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఆగస్టు 15న వైరా పట్టణంలో రాజీవ్ లింక్ కెనాల్, రెండు లక్షల రుణమాఫీ అమలు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సభకు వేలాదిగా తరలివచ్చి రైతులు, ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.