NTV Telugu Site icon

Flights Diversion : కమ్మేసిన పొగమంచు.. విమానాల దారి మళ్లింపు

Weather Updates

Weather Updates

Flights Diversion : కృష్ణా జిల్లాను పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అలాగే గన్నవరం ఎయిర్‌పోర్టు (Gannavaram Airport) వద్ద కూడా భారీగా పొగమంచు కమ్మేసింది. దీంతో విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. పొగమంచు కారణంగా క్లియరెన్స్ లేక గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద పలు విమానాలు గాలిలోనే చక్కర్లు కొడుతున్నాయి. పొగమంచు కారణంగా సుమారు గంట నుంచి ఫ్లైట్స్‌ గాల్లోనే చక్కర్లు కొడుతున్న పరిస్థితి. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాల అన్నీ కూడా కిందకు ల్యాండ్ కాని పరిస్థితి ఏర్పడింది.

Ponnam Prabahakar: నేడు కేసీఆర్ ను కలవనున్న మంత్రి పొన్నం ప్రభాకర్..

పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగాల్సిన విమానాలు దిగలేకపోతున్నాయి. పొగమంచు కమ్మేయడంతో ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో విమానాలు దాదాపు గంట నుంచి గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. బెంగళూరు, మద్రాస్ నుంచి రావాల్సిన విమానాలు ఉదయం 7:30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు వద్దకు వచ్చాయి. అయితే పొగమంచుతో ఆ విమానాల ల్యాండింగ్ ఇబ్బందికర పరిస్థితి ఉందని ఎయిర్‌‌పోర్టు అధికారులు చెప్పడంతో అవన్నీ కూడా గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. వాతావరణం అనుకూలించిన వెంటనే విమానాలను కిందకు దిగేందుకు అనుమతి ఇస్తామని ఎయిర్‌పోర్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాతావరణం అయితే అనుకూలించిందని అధికారులు చెబుతున్నారు.

దీంతో మరికాసేపట్లో విమానాలు ల్యాండింగ్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు (శనివారం) తెల్లవారుజాము నుంచి జిల్లాలో పొగమంచు ఎక్కువగా వ్యాపించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వాహనాలకు రాకపోకలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దగ్గర్లోని వాహనాలు కూడా కనిపించనంతగా పొగమంచు వ్యాపించింది. అటు ఎయిర్‌పోర్టు వద్ద కూడా పొగమంచు కమ్మేయడంతో విమానాలు దిగేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. అయితే గ్రౌండ్ క్లియరెన్స్ రాగానే ఆ విమానాలను కిందకు దిగేందుకు అనుమతి ఇస్తామని ఎయిర్‌పోర్టు అధికారులు చెబుతున్నారు.

Sam Pitroda: నా ఫోన్, ల్యాప్‌టాప్ హ్యాక్.. క్రిప్టోకరెన్సీలో డబ్బు డిమాండ్ చేస్తున్నారు!