Fire In Train: మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ జిల్లాలో ఆదివారం నాడు ప్రయాణికులతో వెళ్తున్న డీఈఎంయూ రైలు ఇంజిన్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మేరకు ఓ రైల్వే అధికారి ఒకరు విషయాన్ని వెల్లడించారు. మంటలు అదుపులోకి వచ్చాయని, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారి తెలిపారు. ఈ ప్రమాదం చాలా భయంకరంగా ఉండడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. డాక్టర్ అంబేద్కర్ నగర్ (మోవ్) నుంచి రత్లాంకు బయలుదేరిన డీఎంయూ రైలు ఇంజిన్‌లో సాయంత్రం 5.30 గంటల సమయంలో రుణిజా – నౌగావ్ మధ్య మంటలు చెలరేగినట్లు పశ్చిమ రైల్వేలోని రత్లాం డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఖేమ్‌రాజ్ మీనా తెలిపారు.
Read Also: Ayodhya Diwali: ప్రపంచ రికార్డు సృష్టించేందుకు రెడీ అవుతున్న రాంలాలా ఆలయం
డైలీ ప్యాసింజర్ రైలులో మంటలు అదుపులోకి తెచ్చామని తెలిపారు. అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదని మీనా తెలిపారు. మంటలు చెలరేగడంతో ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. రైలు ప్రీతమ్ నగర్‌కు మూడు కిలోమీటర్ల ముందు ఉండగా, రైలు ఇంజిన్ నుండి ఒక్కసారిగా పొగ రావడం మొదలైంది. పొగలు రావడంతో రైలును అడవిలోనే నిలిపివేశారు. రైలు ఆగిన తర్వాత ఇంజన్‌లో మంటలు వచ్చినట్లు సమాచారం అందిన వెంటనే ప్రయాణికులు కూడా రైలు నుంచి బయటకు వచ్చారు. రైలు ఆగిన వెంటనే గ్రామస్థులు కూడా రైలు పరిసరాలకు వచ్చారు. దీని తరువాత సమీపంలోని గొట్టపు బావి నుండి పైపును కనెక్ట్ చేసి మంటలను ఆర్పారు. దాదాపు అరగంట పాటు శ్రమించి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. మంటలు ఆర్పిన తర్వాత రైలును ప్రీతమ్ నగర్‌కు తీసుకొచ్చారు. రత్లాం నుంచి వచ్చిన రైల్వే అధికారులు రైలును పరిశీలించారు. విచారణ అనంతరం డీఈఎంయూ రైలును రత్లాంకు తీసుకువస్తారు.
Read Also: Ponnam Prabhakar : తాగి దొరికిన కేసులో బుకాయించి మాట్లాడితే తప్పు ఒప్పైతదనుకుంటే పొరపాటు