World Record Century: 38 బంతుల్లో శతకం.. రికార్డు స్పష్టించిన తనీషా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మహిళల దేశీయ టీ20 క్రికెట్లో కొత్త చరిత్ర ఆవిష్కారమైంది. సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో భాగంగా పుణె వేదికగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 262 పరుగుల భారీ స్కోరు సాధించింది. మహిళల దేశీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక జట్టు స్కోరు కావడం విశేషం. ఇంతకుముందు 2019-20 సీజన్లో అరుణాచల్ ప్రదేశ్‌పై గోవా జట్టు చేసిన 257/2 పరుగుల రికార్డును ఢిల్లీ ఇప్పుడు బద్దలు కొట్టింది.
ఈ భారీ విజయానికి ముఖ్య కారణం ఓపెనర్ తనిషా సింగ్. ఆమె కేవలం 47 బంతుల్లోనే 119 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 38 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకుని, మహిళల టీ20 క్రికెట్లో సంయుక్తంగా మూడో వేగవంతమైన సెంచరీ సాధించిన రికార్డును తన పేరు మీద రాసుకుంది. మరో బ్యాటర్ ప్రియా పునియా కూడా 59 పరుగులతో రాణించింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 188 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేయలేకపోవడంతో ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఏకంగా 42 ఫోర్లు, 5 సిక్సర్లు నమోదయ్యాయి. హైదరాబాద్ బౌలర్లలో పూజ వంక 4 వికెట్లు తీసినప్పటికీ, పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోలేకపోయారు.
Also Read
అనంతరం 263 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. త్రిషా గొంగడి 52 బంతుల్లో 80 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినా, మిగతా బ్యాటర్ల నుంచి తగిన సహకారం లభించలేదు. ప్రణవి చంద్ర 21 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో సుమితి సోని 3 వికెట్లు పడగొట్టి హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీశారు. చివరకు ఢిల్లీ జట్టు 108 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. కొద్ది రోజుల క్రితం ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో జరిగిన మ్యాచ్‌లోనూ తనిషా సింగ్ 92 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
World Record Century: 38 బంతుల్లో శతకం.. రికార్డు స్పష్టించిన తనీషా..
-
Chiranjeevi : నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేయబోతున్న ‘చిరంజీవీస్ మెగావర్స్’!
-
YSRCP: పింఛన్ల పంపిణీపై వైసీపీ ఫిర్యాదు.. టీడీపీకి చెక్ పెట్టాలని డిమాండ్
-
Tata Safari EV: టాటా సఫారీ EV వచ్చేస్తోంది.. మహీంద్రా XEV 9Sకు గట్టి పోటీ!
-
ఎక్సైజ్ కానిస్టేబుల్ సాహసం: అర కిలోమీటరు ఛేజ్ చేసి దొంగను పట్టుకున్న వైనం
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?