ప్రభుత్వ ఉద్యోగానికి ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఆఖరికి అటెండర్ ఉద్యోగమైనా సరే గవర్నమెంట్ జాబ్ మాత్రమే కావాలని పట్టుబడుతుంటారు. కానీ ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చి కేవలం 3 సంవత్సరాలలో రాజీనామా చేయాలని ఆలోచిస్తాడని ఎవరైనా ఊహిస్తారా?. కానీ ఓ యువతి మాత్రం ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగాన్ని వదిలేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో పనిచేస్తున్న వాణి అనే 29 ఏళ్ల యువతి 2020 సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం పొంది 2025 లో రాజీనామా చేసింది. దీని వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆమె చెప్పింది.
Also Read:Bihar Elections: త్వరలోనే బీహార్ ఎన్నికల షెడ్యూల్.. ఎన్నికలు ఎప్పుడంటే..!
ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేస్తూ, అందరు హీరోలు కేప్‌లు ధరించరని, కొందరు విషపూరితమైన ఉద్యోగాలను వదిలివేస్తారని రాసుకొచ్చింది. కాబట్టి నాకు ఉపయోగపడని అధ్యాయాన్ని నేను ముగించాను అని తెలిపింది. ఈ వీడియోలో, ఈ ఉద్యోగం నన్ను ఆర్థిక ఒత్తిడి నుండి స్వతంత్రురాలిని చేసి, నా జీవన ప్రమాణాలను మెరుగుపరిచిందని వాణి చెప్పింది. అయినప్పటికీ, నా మనసు ప్రశాంతంగా లేదు. ఈ ఉద్యోగం నన్ను మానసికంగా అలసిపోయేలా చేసిందని వెల్లడించింది.
Also Read:Ramchander Rao: బీజేపీలో అవినీతి పరులకు స్థానం లేదు… కవితను పార్టీ లోకి తీసుకోము..
నేను ఇంతకు ముందు చాలా సంతోషంగా ఉండేదాన్ని, కానీ గత మూడు సంవత్సరాలలో నేను చాలా చిరాకుగా, కోపంగా మారిపోయాను. ఇప్పుడు జీతం కంటే శాంతిని ఎంచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె చెప్పింది. కాబట్టి ఇప్పుడు నేను ఆర్థిక స్థిరత్వం కంటే మానసిక ప్రశాంతతను ఎంచుకోబోతున్నాను అని తెలిపింది. దీనితో పాటు, ఆమె తన వీడియోలో ఎవరినీ ప్రేరేపించడం తన ఉద్దేశ్యం కాదని చెప్పింది. బదులుగా, ఆమె తన కథను పంచుకోవడమే తన ఉద్దేశ్యం అని చెప్పింది. మీకు సంబంధం లేని చోటు వదిలి వెళ్ళిన తర్వాత వచ్చే ఆనందం, మానసిక ప్రశాంతత మీ విచారం కంటే చాలా మంచిదని వాణి చెప్పింది. ఈ విషయంపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.