Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhijit Dipke: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తలపెట్టిన నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేతో పాటు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలలను ఢిల్లీ పోలీసులు ఏకంగా విమానంలోనే అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్న విమానం ల్యాండ్ అవగానే, పోలీసుల బృందం నేరుగా ఫ్లైట్ లోపలికి ప్రవేశించి ఈ హైడ్రామాకు తెరతీసింది. పోలీసులు విమానం ఎక్కిన వెంటనే అభిజీత్ దిప్కే తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియో ద్వారా ఈ దృశ్యాలను షేర్ చేశారు. “మేము విమానం దిగే వరకు కొంచెం కూడా ఆగలేరా? రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి, మేమేమి భయపడటం లేదు” అంటూ ఫ్లైట్‌లోని మహిళా పోలీసులతో దీప్కే వాగ్వాదానికి దిగినట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద జరగాల్సిన నిరసనలో పాల్గొనేందుకే అభిజీత్ ముంబై నుంచి ఢిల్లీ బయలుదేరారు.
ఈ ముందస్తు అరెస్టులను సీజేపీ తీవ్రంగా ఖండించింది. అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలలను విమానం దిగకముందే బలవంతంగా అదుపులోకి తీసుకోవడం అత్యంత అప్రజాస్వామికమని, శాంతియుత నిరసనలను అణచివేసే కుట్రలో భాగంగానే ఢిల్లీ పోలీసులు ఈ ప్రీ-ప్లాన్డ్ చర్యకు పాల్పడ్డారని సీజేపీ ఓ ప్రకటనలో ఆరోపించింది. పౌరుల భావప్రకటన స్వేచ్ఛను, ప్రయాణ స్వేచ్ఛను కాలరాస్తున్నారని మండిపడుతూ, వీరందరినీ తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ నిరసనలను ఎక్కడికక్కడ అణచివేయడానికి పోలీసులు భారీ ఎత్తున చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఉదయాన్నే ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, సీజేపీ లీగల్ సెల్ హెడ్ రత్నా సింగ్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం వీళ్లే కాకుండా, నిన్న రాత్రి నుంచి ఢిల్లీ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సుమారు 400 మందికి పైగా అనుమానిత నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
ఈ నిరసనకు ముందస్తు అనుమతి కోరలేదనే కారణంతో శుక్రవారమే ఢిల్లీ పోలీసులు దీనిని తిరస్కరించిన విషయం తెలిసిందే. ఏదేమైనా, ఈ నిరసనను పూర్తిగా అడ్డుకోవడానికి ఢిల్లీలో ఎన్నడూ లేనివిధంగా భారీ ఆంక్షలు విధించారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా 30 వేలకు పైగా పోలీసులను, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) బలగాలను రంగంలోకి దించింది. అంతేకాకుండా, నిరసనకారుల రాకపోకలను పూర్తిగా నిలిపివేసేందుకు ఏకంగా 45 మెట్రో స్టేషన్లను మూసివేయడంతో పాటు డజన్ల కొద్ది రైళ్లను రద్దు చేశారు.
తాజావార్తలు
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!