Delhi Liquor Scam: సీబీఐ కేసులోనూ అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి

Delhi Liquor Scam

Delhi Liquor Scam

Delhi Liquor Scam: రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు శరత్‌ చంద్రారెడ్డి, తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్‌గా మారారు. అప్రూవర్‌గా మారిన తర్వాత సెక్షన్‌ 164 కింద సీబీఐ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆయన స్టేట్‌మెంట్‌ను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నమోదు చేసుకున్నారు. దీంతో మద్యం వ్యవహారంలో సీబీఐ, ఈడీ వేర్వేరుగా నమోదు చేసిన 2 కేసుల్లోనూ శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. ఢిల్లీ మద్యం వ్యవహారం కేసులో ఇటీవల ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  శరత్‌ చంద్రారెడ్డిని కవిత బెదిరించారంటూ సీబీఐ కోర్టుకు తెలిపింది. శరత్‌ చంద్రారెడ్డిని రూ.25 కోట్లు కవిత డిమాండ్‌ చేశారని న్యాయస్థానానికి వివరించింది. ఈ నెల 23వరకు సీబీఐ కోర్టు కవితకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. జ్యుడీషియల్ రిమాండ్‌కి ఇచ్చిన నాలుగు రోజుల్లో సీబీఐ కేసులో అప్రూవర్ గా శరత్ చంద్ర రెడ్డి స్టేట్ మెంట్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది.

Read Also: Bandi Sanjay: ఇండియన్ పొలిటికల్ లీగ్‌లో ఐపీఎల్ కప్ మోడీదే..