NTV Telugu Site icon

Delhi In Danger: ఢిల్లీలో గాలితో పాటు నీరు కూడా విషపూరితం

Yamuna River

Yamuna River

Delhi In Danger: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యపు విషం మితిమీరిపోతుంది. అయితే, వాతావరణ కాలుష్యమే కాకుండా నీరు కూడా విషతుల్యంగా మారుతోంది. ఓ వైపు ఢిల్లీ గాలి కలుషితమై ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతుంటే., మరోవైపు యమునా నదిలో పెద్ద ఎత్తున నురగలు రావడం మొదలైంది. ఓ నివేదిక ప్రకారం.. నదిలో మురుగు నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. దీని కారణంగా పండుగ సమయంలో పూజించే వారికి ఇది ప్రమాదకరం. ఇదివరకు వర్షాలు బాగా కురవడంతో నదిలో గతంలో కంటే ఆక్సిజన్‌ ​​స్థాయి పెరిగింది. కానీ, దీనితో పాటు నదిలో ఫీకల్ కోలిఫాం స్థాయి కూడా గణనీయంగా పెరిగింది. తాజాగా యమునా భయానక వీడియో ఒకటి బయటపడింది. ఇందులో నదిలో నురుగు మాత్రమే కనిపిస్తుంది. మంచు నుండి కనిపించే ఈ నురుగులు నదిలో చాలా దూరం వ్యాపించి ఉన్నాయి. నదిలో నీరు తక్కువగా ఉండి నురగ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ వీడియో కాళింది కుంజ్ ప్రాంతానికి చెందినది.

Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. అన్ని బెంచ్‌లలో జరిగే వాదనలు ప్రత్యక్ష ప్రసారం..

తెల్లటి నురుగు మందపాటి పొర యమునాలో పడే మురుగునీటి శుద్ధి కర్మాగారాల వ్యర్థాల నుండి తయారవుతుంది. ఈ తెల్లని నురుగుకు ఒక ప్రధాన కారణం చిన్న, పెద్ద కర్మాగారాల నుండి వెలువడే రసాయన వ్యర్థాలు. ఇది కాలువల ద్వారా యమునాలోకి వస్తుంది. వాస్తవానికి, ఫ్యాక్టరీ నుండి విడుదలయ్యే రసాయన వ్యర్థాల వల్ల కూడా ఈ పొర ఏర్పడుతుంది. వీటివల్ల క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులకు ప్రధాన కారణం అవుతున్నాయి. అయితే, ప్రభుత్వ అధ్వాన్నమైన వైఖరి కారణంగా యమునాను శుభ్రం చేయలేకపోతున్నారు. యమునా నదిని శుభ్రం చేయడానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. కానీ, ఆ డబ్బు బహుశా కాగితాలకే ఖర్చు అవుతుంది కాబోలు. దాని ప్రభావం యమునా నీటిలో కనిపించదు. ఈ ఏడాది సెప్టెంబరులో ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ యమునా నదిలోని అన్ని ప్రాంతాల నుంచి యమునా నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపగా, యమునా నీటి నమూనాల పరీక్షా రిపోర్టు రావడంతో దిగ్భ్రాంతి కలిగించింది.

Jharkhand Assembly Elections: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే, మిత్రపక్షాల సీట్ల ఖరారు