ఢిల్లీ అగ్నిగుండంగా మారింది. ఎన్నడూ లేనంత రికార్డ్ ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలో ఈరోజు 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలోని ముంగేష్‌పూర్‌లోని వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 2.30 గంటలకు 52.3 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు పేర్కొంది. రికార్డు ఉష్ణోగ్రతలతో ఢిల్లీ వాసులు బెంబెలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో.. ఎండ వేడిమి తట్టుకోలేక ఉపశమనం కోసం కూలర్లు, ఏసీలు రికార్డుస్థాయిలో వినియోగిస్తున్నారు. దీంతో ఢిల్లీలో ఎప్పుడూ లేనంతగా విద్యుత్ వినియోగం 8302 మెగావాట్లకు చేరింది. మరోవైపు.. ఢిల్లీలో రికార్డ్ ఉష్ణోగ్రత నమోదైన అనంతరం తాజాగా పలు చోట్ల వర్షం కురుస్తుంది.
Read Also: Share Markets: ఎన్నికల చివరి దశ ముందు అమ్మకాల ఒత్తిడి.. నష్టాలలో మార్కెట్స్..
మరోవైపు.. ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని ఫలోడిలో 51 డిగ్రీల సెల్సియస్, 50.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు.. హర్యానాలోని సిర్సాలో 50.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మరోవైపు.. అరేబియా సముద్రం నుండి తేమతో కూడిన గాలుల కారణంగా దక్షిణ రాజస్థాన్ లోని బార్మర్, జోధ్‌పూర్, ఉదయపూర్, సిరోహి, జలోర్లో ఈ రోజు 4 డిగ్రీల సెల్సియస్ తగ్గుదల నమోదైంది. ఇది వాయువ్య భారతదేశంలో వేడి తరంగాల తగ్గింపు ప్రారంభాన్ని సూచిస్తుంది.
Read Also: Chiranjeevi: నన్ను పరుగులు పెట్టించి, శుభం కార్డు వేశారు.. సీనియర్ జర్నలిస్ట్ ఎమోషనల్
భవిష్యత్ వాతావరణాన్ని అంచనా వేయడానికి.. ప్రస్తుత వాతావరణ పరిశీలనలను ప్రాసెస్ చేయడానికి కంప్యూటర్ మోడల్‌లను ఉపయోగించే న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ (NWP) డేటా.. ఈ తగ్గుదల ధోరణి మే 30 నుండి వేడిగాలుల పరిస్థితుల నుండి క్రమంగా ఉపశమనాన్ని కలిగిస్తూ ఉత్తరం వైపు మరింత విస్తరిస్తుంది అని తెలిపింది. అదే విధంగా.. గురువారం నుండి బంగాళాఖాతంలో తేమతో కూడిన గాలులు వీస్తుండటం వల్ల ఉత్తరప్రదేశ్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది.
