Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Delhi High Court Reserves Order On The Petition Moved By Kejriwal Challenging His Arrest And Ed Remand

Kejriwal: అరెస్ట్, ఈడీ కస్టడీపై హైకోర్టులో వాదనలు.. తీర్పు రిజర్వ్

Published Date :April 3, 2024 , 5:39 pm
By Suresh Maddala
Kejriwal: అరెస్ట్, ఈడీ కస్టడీపై హైకోర్టులో వాదనలు.. తీర్పు రిజర్వ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. అరెస్ట్, ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా ఇరు పక్షాలు న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. అనంతరం తీర్పును ధర్మాసనం గురువారానికి రిజర్వ్ చేసింది.

మార్చి 21న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం ఏప్రిల్ 1న తిరిగి హాజరుపరచగా ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. అరెస్టు, ఈడీ రిమాండ్‌ను సవాల్ చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

హైకోర్టులో ఈడీ తరఫున ఏఎస్‌జీ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. కేజ్రీవాల్.. డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేశారని ఈడీ తరపు న్యాయవాది వెల్లడించారు. లిక్కర్ కేసులో డబ్బుకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా గుర్తించినట్లు తెలిపారు. హవాలా ద్వారా వందల కోట్లు ఆప్ పార్టీకి అందాయని… ఆ డబ్బంతా గోవా ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకుంటారని.. వ్యవహారాలన్నింటికీ ఆయనే బాధ్యత వహిస్తారన్నారు. ఇండో స్పిరిట్ బ్లాక్ లిస్ట్ దానికి హోల్ సేలర్ లైసెన్స్ ఎలా ఇచ్చారని.. హోల్ సేల్ దుకాణాలకు 5 శాతం ఉన్న లాభాలను 12 శాతానికి పెంచి.. పెరిగిన 7 శాతం లాభాలను ముడుపుల రూపంలో ఆప్ తీసుకుందని ఈడీ లాయర్ చెప్పుకొచ్చారు. ఆప్ మీడియా ఇంఛార్జ్ విజయ్ నాయర్ లిక్కర్ కేసులో కీలక పాత్ర పోషించారని.. ఆధారాలు దొరకకుండా చేసేందుకు కోట్ల రూపాయల ఫోన్లను ధ్వంసం చేశారన్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ ప్రత్యక్షంగా ఉన్నారని ఈడీ వాదనలు వినిపించింది.

కేజ్రీవాల్‌ను ఉద్దేశ్వపూర్వకంగానే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారని కేజ్రీవాల్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఆప్‌ను బలహీనపర్చేందుకే అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బకొట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిందని అభిషేక్ స్పష్టం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును గురువారం (04-04-2024) మధ్యాహ్నానికి ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Arrest and ED remand
  • Delhi High Court
  • Kejriwal challenging
  • petition moved
  • Reserves order

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions