Delhi High Court: ‘మీరు జెన్-జీ కాదు’.. సీజేపీ నేతల వయసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- ‘మీరు జెన్-జీ కాదు’
- సీజేపీ నేతల వయసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సౌరవ్ దాస్, ఆశుతోష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మీరు Gen Z కాదు’ అంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా వయసులపై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. జంతర్ మంతర్ దగ్గర నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జాతీయ జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో జ్యుడీషియల్ కస్టడీ పొడిగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది అభిక్ చిమ్నీ వాదనలు వినిపిస్తూ.. సౌరవ్ దాస్ వయసు 27 ఏళ్లు కాగా.. ఆశుతోష్ రంకా వయసు 32 ఏళ్లని కోర్టుకు తెలిపారు. దీంతో స్పందించిన న్యాయస్థానం.. “అయితే మీరు Gen Z కాదు. అసలు Gen Z అంటే ఏమిటి?” అని వ్యాఖ్యానించినట్లు బార్ అండ్ బెంచ్ నివేదించింది. 1997 తర్వాత జన్మించిన వారిని సాధారణంగా Gen Zగా పరిగణిస్తారని న్యాయవాది వివరించగా.. “అయితే మీరు Gen Z కాదు” అని కోర్టు మరోసారి వ్యాఖ్యానించింది. మొత్తానికి సౌరవ్-రాంకా కస్టడీ పొడిగింపును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేపీ ఉపసంహరించుకుంది.
జస్టిస్ సుబ్రమోనియం ప్రసాద్ ఈ కేసును విచారించారు. సంబంధిత ఉత్తర్వులను సవాలు చేసేందుకు రివిజన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉండగా.. పిటిషనర్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) అక్టోబర్ 19న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. ఆ ఉత్తర్వుల ప్రకారం.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాల న్యాయ నిర్బంధాన్ని అక్టోబర్ 21 వరకు పొడిగించారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్లు 126, 170 కింద ప్రారంభించిన ముందస్తు నిరోధక చర్యల్లో భాగంగా ఈ నిర్బంధం విధించారు. జంతర్ మంతర్ దగ్గర నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జాతీయ జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో ఈ వ్యవహారం కొనసాగుతోంది.
Also Read
తాజావార్తలు
-
Hyderabad Crime: ప్రేమికుడి వేధింపులు.. యువతి ఆత్మహత్య
-
Vijay Deverakonda: ప్రేక్షకులు నా మాటను నిజం చేశారు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
-
Earthquake: వనౌటులో రెండు శక్తివంతమైన భూకంపాలు.. 7.1 తీవ్రత నమోదు
-
AP ZPTC, MPTC Elections: జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్లపై కూటమి కసరత్తు.. ఆశావహుల నామినేషన్లతో కూటమిలో టెన్షన్..
-
Trump: ఒప్పందం చేసుకోకపోతే మళ్లీ దాడి చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!