Abhishek Sharma: “గర్ల్‌ఫ్రెండ్” అంటూ ప్రచారం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అభిషేక్ శర్మ.. కట్‌చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma: భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ తన ‘పర్సనాలిటీ రైట్స్’ (వ్యక్తిత్వ హక్కులు) రక్షణ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అతని పేరు, ముఖచిత్రం (likeness), గుర్తింపును దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వివాదాస్పద లింకులను (URLs) తక్షణమే తొలగించాలని ఇంటర్మీడియరీలను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ కేసులోని నిందితులకు (defendants) కోర్టు సమన్లు జారీ చేసింది. జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఈ కేసును విచారించింది. నిందితుల సామాజిక మాధ్యమాల (social media handles) ద్వారా, అందుబాటులో ఉన్న చిరునామాలు, చట్టబద్ధమైన అన్ని మార్గాల ద్వారా ఈ సమన్లు, నోటీసులను అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.
ముఖ్యంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో డిజిటల్‌గా మార్చిన అసభ్యకరమైన కంటెంట్‌ను తొలగించాలని అభిషేక్ శర్మ కోర్టును ఆశ్రయించారు. ఒక నిర్దిష్ట ఏఐ పోస్ట్‌లో క్రికెటర్ ఫొటోను అతని మేనేజర్‌తో కలిపి తప్పుడు వ్యాఖ్యలతో గర్ల్‌ఫ్రెండ్ అంటూ తప్పుగా చిత్రీకరించారని అతని తరఫు న్యాయవాది గౌరవ్ బాల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం అభిషేక్ గుర్తింపును వాడుకుంటున్నారని తెలిపారు. కాగా, ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ (Meta) తరఫున హాజరైన అడ్వకేట్ వరుణ్ పాఠక్ స్పందిస్తూ.. ప్రస్తుతం తమ ప్లాట్‌ఫారమ్‌లలో కేవలం రెండు అభ్యంతరకర లింకులు (ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకటి చొప్పున) మాత్రమే అందుబాటులో ఉన్నాయని, వాటిని కూడా త్వరలోనే పూర్తిగా తొలగిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. అలాగే అభ్యంతరకర లింకులను తొలగించేందుకు అమెజాన్ ప్రతినిధులు సైత అంగీకరించారు.
Also Read
- Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
తాజావార్తలు
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!