NTV Telugu Site icon

Supreme court: తాగునీటి కోసం ఆప్ ప్రభుత్వం పిటిషన్.. ఏం కోరిందంటే..!

Water

Water

తాగునీటి కోసం ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. గత కొద్ది రోజులుగా తాగునీటి సమస్యతో దేశ రాజధాని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసినా నీళ్లు సరిపోవడం లేదు. దీంతో దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆప్ ప్రభుత్వ ఆశ్రయించింది. హర్యానా, యూపీ, హిమాచల్ ప్రదేశ్ నుంచి నీటి సరఫరా అయ్యేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరింది.

ఇది కూడా చదవండి: DK.shivakumar: ప్రత్యర్థుల పూజలపై డీకే.శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

ఒక వైపు దేశ రాజధానిలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు నీటి కష్టాలు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమిని తట్టుకోలేక విలవిలలాడుతున్నారు. ఇటీవల 52 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది.

దేశ రాజధానిలో తీవ్ర నీటి కొరత ఉన్న నేపథ్యంలో హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌ల నుంచి ఒక నెల పాటు అదనపు నీటి సరఫరా చేయాలని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఢిల్లీలోని చాణక్యపురి సంజయ్ క్యాంప్ ప్రాంతం, గీతా కాలనీ ప్రాంతంతో సహా పలు ప్రాంతాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ట్యాంకర్లు వచ్చినా నీళ్లు లభించక ఇబ్బందులు పడుతున్నారు.

ఇక దేశ రాజధానిలో హీట్‌వేవ్ పరిస్థితులు రాబోయే కొద్ది రోజులు కొనసాగుతాయని వాతావరణ కార్యాలయం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఇది కూడా చదవండి: Warangal: కుళ్లిన మాంసాన్ని మసాలాతో కవర్ చేస్తున్నారు.. తినే ముందు జర జాగ్రత్త

Show comments