ఢిల్లీ ప్రభుత్వం వాహనదారులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఆ రోజు నుంచి ఆ వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. ఢిల్లీలోని కాలుష్యం ఊపిరాడకుండా చేస్తోంది. కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే నవంబర్ 1 నుండి, BS-VI నిబంధనలకు అనుగుణంగా లేని అన్ని కమర్షియల్ వాహనాలను ఢిల్లీలోకి ప్రవేశించడాన్ని ప్రభుత్వం నిషేధిస్తుంది. ఈ ఉత్తర్వును కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) జారీ చేసింది. ముఖ్యంగా శీతాకాలంలో కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఢిల్లీ గాలి నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటోంది.
Also Read:Viral Video: ఈ డాక్టర్ కు బీపీ ఎక్కువా ఏంటీ?.. వైద్యం కోసం పోతే చెంప చెల్లుమనిపించిందిగా..
ఢిల్లీ రవాణా శాఖ జారీ చేసిన పబ్లిక్ నోటీసు ప్రకారం, ఇప్పుడు BS-VI నిబంధనలకు అనుగుణంగా ఉన్న కమర్షియల్ వాహనాలను మాత్రమే ఢిల్లీలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు. కఠినమైన BS-VI (భారత్ స్టేజ్ 6) ఉద్గార ప్రమాణాలకు కట్టుబడి ఉండే ఈ వాహనాలు కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన BS-IV కంప్లైంట్ కమర్షియల్ వాహనాలను అక్టోబర్ 31, 2026 వరకు ఢిల్లీలో నడపడానికి అనుమతించింది. దీని తరువాత, BS-VI కంప్లైంట్ వాహనాలను మాత్రమే రాజధానిలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు.
ఢిల్లీలో నమోదైన కమర్షియల్ వాహనాలను, BS-VI కంప్లైంట్ డీజిల్ వాహనాలు, BS-IV డీజిల్ వాహనాలు (అక్టోబర్ 31, 2026 వరకు), CNG, LNG లేదా ఎలక్ట్రిక్ వాహనాలతో సహా కొన్ని వాహనాలకు ఈ ఉత్తర్వు కింద మినహాయింపు ఇచ్చారు. అదనంగా, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) కింద ఇతర పరిమితులు అమలులో ఉంటాయి, ఇవి ఢిల్లీలోని గాలి నాణ్యత స్థాయిల ఆధారంగా ఆక్టివేట్ అవుతాయి.
Also Read:Pakistan: ఆఫ్ఘానిస్తాన్‌పై డ్రోన్ దాడిలో అమెరికా హస్తం ఉందా..? అందుకు పాక్ సహకరిస్తుందా..?
శీతాకాలంలో వాహన ఉద్గారాలను నియంత్రించడం లక్ష్యంగా అక్టోబర్ 17న జరిగిన CAQM సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుండి జనవరి వరకు ఢిల్లీ గాలి నాణ్యత గణనీయంగా క్షీణిస్తుంది, దీనికి కారణం వాహన ఉద్గారాలు, చెత్త దహనం, వాతావరణ పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం BS-VI నిబంధనలకు అనుగుణంగా లేని అన్ని కమర్షియల్ వాహనాలను ఢిల్లీలోకి ప్రవేశించడాన్ని ప్రభుత్వం నిషేధిస్తుంది.