Delhi murder case: దేశ రాజధానిలో సంచలన ఘటన వెలుగుచూసింది. ఢిల్లీలోని దాబ్రీ ప్రాంతంలో ఒక యువతి మృతదేహం గోనె సంచిలో కనిపించడంతో ప్రజలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలించడం మొదలు పెట్టారు. ఈక్రమంలో నిందితుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన సలీంగా గుర్తించి అరెస్టు చేశారు.
READ ALSO: allergy death: అలర్జీ ఎంత పని చేసిందంటే.. 22 ఏళ్ల అమ్మాయి 24 గంటల్లో మృతి
అసలు ఏం జరిగిందంటే..
ఈసందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఆగస్టు 23 మధ్యాహ్నం 2:54 గంటల ప్రాంతంలో ద్వారకా-దబ్రీ ప్రాంతంలోని డ్రెయిన్ దగ్గర అనుమానాస్పద సంచి దొరికిందని దబ్రీ పోలీస్ స్టేషన్‌కు సమాచారం వచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ సంచిలో ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మృతురాలిని(20) ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు సహాయంతో గుర్తించినట్లు తెలిపారు. ఆమె ఆగస్టు 21న తప్పిపోయినట్లు మృతిరాలి తల్లి ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక నిఘా ఆధారంగా సలీంను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు తెలిపారు. నిందితుడు మృతురాలితో కలిసి ఒక భవనంలోకి ప్రవేశించి, తరువాత ఒంటరిగా వెళ్లిపోయాడని, ఆమె శరీరాన్ని ఒక సంచిలో మోసుకెళ్లడం ఫుటేజ్‌లో కనిపించిందని పేర్కొన్నారు. మృతి చెందిన అమ్మాయికి నిందితుడు సలీంకు ముందు నుంచీ పరిచయం ఉందని, ఆమె ఆగస్టు 21న సలీంను కలవడానికి వెళ్లిందన్నారు. అప్పుడు ఆ అమ్మాయి నిందితుడిని తన దగ్గరి నుంచి గతంలో తీసుకున్న డబ్బు ఇవ్వాలని అడిగిందని, దీంతో వాళ్లిద్దరి మధ్య డబ్బు విషయంలో వాగ్వాదం జరిగి, కోపంతో సలీం ఆమెను గొంతు కోసి చంపాడని తెలిపారు. హత్య తర్వాత నిందితుడు మృతదేహాన్ని ఒక సంచిలో వేసి తన బైక్‌పై తీసుకెళ్లి దాబ్రీ సమీపంలోని కాల్వలో పడేయడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో మృతదేహం జారిపడి రోడ్డుపైన వెళ్లే వారి దృష్టిని ఆకర్షించింది. వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.
యూపీలో అరెస్టు..
నిందితుడిని పట్టుకోవడానికి అనేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. హార్డయ్‌లో నిందితుడు ఉన్నట్లు సమాచారం రావడంతో వెంటనే పోలీసులు బృందాలు అక్కడికి వెళ్లి అతన్ని అరెస్టు చేశాయి. నిందితుడిని పట్టించడంలో బాలిక చేతిలో ఉన్న పచ్చబొట్టు కీ రోల్ ప్లే చేసిందని అధికారులు తెలిపారు.
READ ALSO: TMC MLA escapes ED: ఈడీకి భయపడి ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకిన ఎమ్మెల్యే..