NTV Telugu Site icon

Delhi Encounter: ఢిల్లీలో ఎన్‌కౌంటర్‌.. హాశిమ్‌ ముఠాకు చెందిన ముగ్గురు గ్యాంగ్‌స్టర్లు అరెస్ట్‌!

Delhi Encounter

Delhi Encounter

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం అర్ధరాత్రి పోలీసులకు, గ్యాంగ్‌స్టర్లలకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో హషీమ్ బాబా ముఠాకు చెందిన ముగ్గురు గ్యాంగ్‌స్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈశాన్య ఢిల్లీలోని అంబేడ్కర్‌ కాలేజీ సమీపంలో సోమవారం రాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

హాశిమ్‌ ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులు మార్చి 9న అర్బాజ్‌ అనే వ్యక్తిని కాల్చి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల గురించి పోలీసులకు సోమవారం సమాచారం అందింది. పోలీసులు వారిని పట్టుకోవడానికి వెళ్లగా.. గ్యాంగ్‌స్టర్లు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ క్రమంలో హాశిమ్‌ ముఠాకు చెందిన ముగ్గురు సభ్యుల కాళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు వారిని పట్టుకొని ఆస్పత్రికి తరలించారు.

Also Read: Anushka Shetty: సన్నబడిన అనుష్క శెట్టి.. స్లిమ్ లుక్‌ పిక్ వైరల్!

గాయపడిన దుండగులను అలీ అలియాస్ ఫహాద్, ఆసిఫ్ అలియాస్ ఖలీద్, అల్సెజాన్ అలియాస్ థోథాగా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. గోకుల్‌పురి మెట్రో స్టేషన్‌కు సమీపంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మూడు రోజుల క్రితం శీలంపూర్‌లో జరిగిన ఘటనలో అర్బాజ్‌ చనిపోగా.. మరొకరు గాయపడ్డారు. గ్యాంగ్‌స్టర్లు కోలుకున్నాక విచారణ చేపట్టే అవకాశం ఉంది.