Site icon NTV Telugu

Delhi: ఇద్దరు కలిసి అక్కడకు వెళ్లేవారు.. ఇంతలోనే హఠాత్ పరిణామాలు

New Project (14)

New Project (14)

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని దబ్రీ ప్రాంతంలో గురువారం రాత్రి 40 ఏళ్ల మహిళ తన ఇంటి ముందే కాల్చి చంపబడింది. ఘటనా స్థలం నుంచి ఓ యువకుడు పరారయ్యాడు. అనంతరం ఆ 23 ఏళ్ల ఆశిష్ తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనకు గల కారణాలను పోలీసులు తెలిపారు. రేణు గోయల్ అనే మహిళను 23 ఏళ్ల ఆశిష్ కాల్చాడు. మహిళను వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడికి చేరుకునే లోపే ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు. నిందితుడు ఆశిష్ కాలినడకన మహిళ దగ్గరికి వచ్చి తలపై కాల్చి చంపాడని పోలీసు అధికారులు చెబుతున్నారు.

Read Also:Purandeswari: నిర్మలా సీతారామన్‌కి పురంధేశ్వరి లేఖ.. జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదు..!

మహిళను కాల్చిచంపిన తర్వాత ఆశిష్ తన టెర్రస్‌పైకి వెళ్లాడని, అక్కడ కంట్రీ మేడ్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడి ఇంటికి ఓ పోలీసులు బృందం వెళ్లింది. అతను తల్లిదండ్రులతో కలిసి ఉంటాడని తేలింది. నిందితుడి ఇంటి పైకప్పుపై పిస్టల్ లభ్యం కావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆశిష్, రేణు ఇద్దరు ఒకే జిమ్‌కు వెళ్లేవారని ఆరోపించారు.

Read Also:Vande Bharat Meals: వందే భారత్ ఎక్స్ ప్రెస్ భోజనంలో స్పెషల్ ఐటెం.. అదేంటంటే?

రేణు గృహిణి, ఆమెకు భర్త , ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై ద్వారకా డీసీపీ మాట్లాడుతూ.. హత్యకు ప్రాథమికంగా వ్యక్తిగత శత్రుత్వమే కారణమని తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గురువారం ఉదయం దాబ్రీ పోలీసులకు హత్య విషయం తెలిసిందని డీసీపీ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దీని నుండి మరింత సమాచారం పొందవచ్చు.

Exit mobile version