Vande Bharat Meals: వందే భారత్ ఎక్స్ ప్రెస్ భోజనంలో స్పెషల్ ఐటెం.. అదేంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Meals: సూపర్ స్పీడ్‌తో పరుగెడుతున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ప్రమాదాల కారణంగానో, సౌకర్యాల విషయంలోనే ఎదో ఒక విధంగా హైలైట్ అవుతూనే ఉన్నాయి. ప్రమాదాల కారణంగా జరిగిన మరమ్మత్తులకు ఇప్పటి వరకు సుమారు 50 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు రైల్వే శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇపుడు జరిగిన మరో ఘటనతో వందేభారత్ రైళ్లు మరోసారి సోషల్ మీడియాలోకి వచ్చింది. తాజాగా మధ్యప్రదేశ్ లో ఈ ట్రైన్ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. అదెలా అంటే.. ఈ రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి ఫుడ్ పార్సిల్ లో బొద్దింక రావడంతో రైలు పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. కేంద ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైల్లో ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది.
Read also: Mobile Theft: కర్మరా బాబు.. మొబైల్ పోయిందని స్టేషన్‌కు పోతే నిమిషాల్లోనే బైక్ పోయింది
Also Read
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
సరికొత్త హంగులతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ రైళ్ళలో అంతా అత్యాధునికమేనని ప్రచారం చేస్తుండటంతో ఆహారం కూడా హైజీనిక్ గా ఉంటుందని భావించి ఫుడ్ ఆర్డర్ చేశాడో ప్రయాణీకుడు. తీరా ఆర్డర్ వచ్చాక ఆత్రుతతో ఓపెన్ చేసి చూస్తే రోటీలకు బొద్దింక అతుక్కుని ఉంది. దీంతో రోటీలకంటే ముందు ఖంగుతిన్న ప్రయాణికుడు సుబోధ్ పహాలాజన్ ఈ ఉదంతం మొత్తాన్ని ఎక్స్(ఒకప్పటి ట్విట్టర్) సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రోటీకి అతుక్కున్న బొద్దింక ఫోటో తోపాటు వందే భారత్ రైలులో నాకు ఒక బొద్దింక వచ్చిందని క్యాప్షన్ కూడా రాశారు. దీనికి రైల్వే కేటరింగ్ సేవ వారు స్పందింస్తూ.. మీకు ఎదురైన చేదు అనుభవానికి చింతిస్తున్నాము. దీనికి బాధ్యులైన వారి మీద వెంటనే చర్యలు తీసుకుంటాము. మీ పీఎన్ఆర్ నెంబరు ఫోన్ నెంబరు మాకు డైరెక్ట్ మెసేజు పంపగలరు అని కోరుతూనే మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
@IRCTCofficial found a cockroach in my food, in the vande bharat train. #Vandebharatexpress#VandeBharat #rkmp #Delhi @drmbct pic.twitter.com/Re9BkREHTl
— pundook🔫🔫 (@subodhpahalajan) July 24, 2023
తాజావార్తలు
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!