శనివారంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు లభించిన మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం కోసం సుప్రీంకోర్టు 21 రోజులు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 1వరకు బెయిల్ ఇచ్చింది. ఈ గడువు రేపటితో ముగుస్తుంది. మరోవైపు మధ్యంతర బెయిల్ పొడిగించాలని.. అలాగే వైద్య పరీక్షల నిమిత్తం రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని గురువారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును కేజ్రీవాల్ అభ్యర్థించారు. దీనిని ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. శనివారంకల్లా సమాధానం ఇవ్వాలని ఈడీకి న్యాయస్థానం ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Amantullah Khan : ఆప్ ఎమ్మెల్యే పై బిగుస్తున్న ఉచ్చు.. అటాచ్‌మెంట్‌కు కోర్టు ఆదేశాలు
ఇదిలా ఉంటే శుక్రవారం కేజ్రీవాల్ వీడియో సందేశం విడుదల చేశారు.. రేపటితో మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో జూన్ 2న తీహార్ జైల్లో సరెండర్ అవుతున్నట్లు ప్రకటించారు. ఈసారి ఎంత కాలం ఉంచుతారో తనకు తెలియదన్నారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. తాను ఎక్కడా తలవంచనని చెప్పారు. జైలు నుంచి వచ్చాక ప్రతీ తల్లికి నెలకు రూ.వెయ్యి వేస్తామని చెప్పారు. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలని ప్రజలకు, కార్యకర్తలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Hamas: ఇజ్రాయెల్ యుద్ధం ఆపితే ఒప్పందానికి రెడీ.. కారణమిదేనా!
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం రెండుసార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అటు తర్వాత జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో తీహార్ జైలుకు తరలించారు. పలుమార్లు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యారు. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టును కేజ్రీవాల్ అభ్యర్థించారు. దీంతో ఆయనకు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రేపటితో ముగియనుండడంతో ఆదివారం ఆయన తీహార్ జైల్లో లొంగిపోనున్నారు.