WPL 2025: శుక్రవారం జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి మాజీ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మొదట బౌలింగ్ చేసిన ఢిల్లీ జట్టు, సీజన్ వన్ విజేత ముంబై ఇండియన్స్‌ను తొమ్మిది వికెట్లకు 123 పరుగులకే పరిమితం చేసింది. జోనాస్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి మూడు ముఖ్యమైన వికెట్లు పడగొట్టింది. ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ 49 బంతుల్లో అజేయంగా 60 పరుగులు చేయగా, షెఫాలి వర్మ 28 బంతుల్లో 43 పరుగులు చేసి ఢిల్లీకి గొప్ప ఆరంభాన్ని అందించారు. వారిద్దరూ కేవలం 59 బంతుల్లో 85 పరుగులు చేశారు.
Also Read: SLBC Tragedy: చివరి దశకు చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్
ఫాస్ట్ బౌలర్ అమన్‌జోత్ కౌర్ బౌలింగ్‌లో డీప్ మిడ్‌వికెట్ వద్ద అమేలియా కెర్‌కు షఫాలీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది. షఫాలీ తన ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టింది. మరోవైపు, లానింగ్ తొమ్మిది ఫోర్ల ఇన్నింగ్స్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. జెమీమా రోడ్రిగ్స్ 10 బంతుల్లో 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఢిల్లీ జట్టు మరో 33 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ వేసిన తర్వాత ఢిల్లీకి మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు యాస్టికా భాటియా (11), హేలీ మాథ్యూస్ (22) ఆరంభంలోనే వెనుదిరిగారు. అయితే, స్కివర్ బ్రంట్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించి, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (18)తో కలిసి మూడో వికెట్‌కు 38 పరుగులు జోడించింది. 11వ ఓవర్లో జోనాస్సేన్ బౌలింగ్‌లో హర్మన్‌ప్రీత్ ఎల్‌బిడబ్ల్యూగా వెనుదిరిగగా.. 14వ ఓవర్లో జోనాస్సెన్ కు స్కివర్ బ్రంట్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ముంబై వికెట్లు పడిపోతూనే ఉండడంతో తక్కువ పరుగులకే పరిమితం అయ్యింది.