ఢిల్లీ సర్కార్ కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మరోసారి వివాదం తలెత్తింది. ఢిల్లీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆప్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టడాన్న ఆపవద్దని వినతి చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. దేశ 75 ఏళ్ల చరిత్రలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా అడ్డుకున్నారని.. ఢిల్లీ ప్రజలపై ఎందుకు అంత కక్ష అంటూ కేజ్రీవాల్ ప్రధాని మోడీని ప్రశ్నించారు. బడ్జెట్ ను ఢిల్లీ ప్రజలు చేతులెత్తి వేడుకుంటున్నట్లు తెలిపారు.
Also Read : ABVP Protest: ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై ఏబీవీపీ నిరసన..
బడ్జెట్ ఆమోదం పొందనందున నేటి నుంచి ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పొందలేరని.. అది కేంద్ర ప్రభుత్వ గూండాయిజమని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. బడ్జెట్ ఆమోదం పొందనందుకు మంగళవారం వార్షిక పద్దును సభలో ప్రవేశపెట్టడం లేదని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బడ్జెట్ ని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా లేవనెత్తన సందేహాలను
నివృతి చేసి, మళ్లీ పంపాలని కేజ్రీవాల్ సర్కార్ ను కోరినా.. 4 రోజులుగా సమాధానం లేదని కేంద్ర హోంశాఖ తెలిపింది. అయితే ఢిల్లీ సీఎస్ దస్త్రాలను దాచిపెట్టారని.. ఢిల్లీ ఆర్థిక మంత్రి కైలాశ్ గహ్లోత్ ఆరోపించారు.
Also Read : Shahid Afridi : మోడీ సర్.. ఇండియా-పాక్ మధ్య మ్యాచ్ లు జరిపించండి..?
ఢిల్లీ బడ్జెట్ పై.. కేంద్రం వివరణ అడిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ప్రభుత్వం ప్రకటనలకు ఎక్కువ.. మిగతా అభివృద్ది కార్యక్రమాలను తక్కువ కేటాయింపులు చేసిందని ఆరోపణల నేపథ్యంలో ఈ వివరణ కోరినట్లు తెలిపాయి. దీనిపై స్పందించిన ఢిల్లీ ఆర్థికశాఖమంత్రి కైలాశ్ గహ్లోత్ ఈ ఆరోపణలును ఖండించారు. అవన్నీ వాస్తావలు కాదన్నారు. ప్రభుత్వ బడ్జెట్ మొత్తం రూ. 78,800 కోట్లుగా ఉందన్నారు. అందులో రూ. 22,000 కోట్లు మౌలిక వసతులపై ఖర్చు చేసేందుకు కేటాయించామని వెల్లడించారు. రూ. 550 కోట్లు మాత్రమే ప్రకటన కోసం కేటాయించినట్లు తెలిపారు. గత సంవత్సరం కూడా ఇంతే మొత్తాన్ని ప్రకటనల కోసం కేటాయించినట్లు గుర్తు చేశారు.
Also Read : Pathaan: హోల్డ్ టైట్… పఠాన్ వస్తున్నాడు…
బడ్జెట్ పై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తూ.. దానిక ఆమోదం తెలపలేదు.. అందుకు సంబంధించి మార్చ్ 17న ఓ లేఖను సీఎస్ ద్వారా పంపింది. దీన్ని మూడు రోజులుగా సీఎస్ తన వద్దే ఉంచుకున్నారు. దీంతో బడ్జెట్ ఆమోదం పొందకపోవడానికి గల కారణాలు రహస్యంగానే ఉన్నాయి. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు తనకు లేఖ గురించి తెలిసింది.
సాయంత్రం 6గంటలకు అధికారికంగా ఆ లేఖ అందింది అంటూ ఢిల్లీ ఆర్థిక మంత్రి కౌలాశ్ గహ్లోత్ అన్నారు. బడ్జెట్ ను ఆలస్యం చేయడంలో ఢిల్లీ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్ని ఉందన్నారు.