NTV Telugu Site icon

Indigo flight: విమానం 2 గంటలు ఆలస్యం.. ఏసీ పనిచేయక అల్లాడిపోయని ప్రయాణికులు

Ac

Ac

అసలే హస్తినలో అధిక ఉష్ణోగ్రతలు.. ఇంకోవైపు కరెంట్ కోతలు.. మరోవైపు తాగునీటి కష్టాలు.. ఇలా దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం రెండు గంటలు ఆగిపోయింది. ఒకవైపు ఉక్కపోత.. ఇంకోవైపు వేడిగాలులు. దీంతో విమానం లోపల ఏసీ లేక ప్రయాణికులు ఉక్కపోతతో అల్లాడిపోయారు. ఇక పిల్లలు, వృద్ధులైతే హడలెత్తిపోయారు. ఈ బాధలను భరించలేక ప్రయాణికులు మొబైల్‌లో వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఢిల్లీ నుంచి బెంగాల్‌లోని బాగ్డోగ్రా వెళ్లాల్సిన ఇండిగో విమానం 2 గంటలు ఆలస్యం అయింది. విమానం మధ్యాహ్నం 2:10 గంటలకు బయలుదేరి 4:10 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే విమానం విమానాశ్రయంలోని టార్మాక్‌పై రెండు గంటలు నిలిచిపోయింది. లోపలేమో ఏసీ లేదు. దీంతో ఉక్కపోతతో ఊపిరాడక ప్యాసింజర్స్ అల్లాడిపోయారు. ఇదిలా ఉంటే బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను మరో గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన దగ్గరలోనే బాగ్డోగ్రా ఎయిర్‌పోర్టు ఉంది. సాంకేతిక కారణంతోనే ఫ్లైట్ ఆలస్యం అయిందని సిబ్బంది పేర్కొ్న్నారు. ఒకసారి ఇంజన్ సమస్య అని.. ఇంకోసారి ఇంధన సమస్య అని చెప్పారు. ఇలా సిబ్బంది తికమక సమాధానాలతో ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బాగ్డోగ్రా విమానాశ్రయం పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి సమీపంలో ఉంది.

ఇది కూడా చదవండి: Yuva Rajkumar: యువ రాజ్‌కుమార్కి లైంగిక సమస్యలు.. హోటల్లో నటితో రెడ్ హ్యాండెడ్ గా దొరికి?

ఇక ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విమానయాన సంస్థ క్షమాపణ చెప్పింది. అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. గమ్యానికి చేరేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Gujarat: రైల్వే ట్రాక్పై సింహాలు.. ట్రైన్ ఆపి రక్షించిన లోకో పైలట్