Auto Driver: దేశ రాజధాని ఢిల్లీకి చెందిన అబ్దుల్ సామీ అనే ఆటో డ్రైవర్ కథ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇతడు ఓ సాధారణమైన వ్యక్తి. పెద్దగా చదువుకొనే అవకాశం రాకపోవడంతో, ఆటో డ్రైవింగ్ నేర్చుకుని ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాడు. ఆర్థికంగా వెనుకబడిన సామీకి వ్యాపారాలూ, పెట్టుబడులూ అంటే తెలియవు. అతడికి తెలిసిందల్లా ఆటో నడపడమే. దాన్ని నమ్ముకుని ఎన్నో సంవత్సరాలుగా జీవన పోరాటం కొనసాగించాడు. కానీ, అతడి జీవితాన్ని మలుపు తిప్పిన…