NTV Telugu Site icon

Rajnath Singh: సనాతన ధర్మం శాశ్వతమైనది.. ప్రపంచంలో ఏ శక్తి అంతం చేయదు

Rajnath

Rajnath

Rajnath Singh: సనాతన్ ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. దీనికి సంబంధించి ‘భారత్’ కూటమిని బీజేపీ టార్గెట్ చేస్తోంది. తాజాగా.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఓ ప్రకటన చేశారు. డీఎంకే మంత్రి చేసిన ప్రకటన చాలా దురదృష్టకరమని అభివర్ణిస్తూ.. సనాతన ధర్మం శాశ్వతమైనదని.. ప్రపంచంలోని ఏ శక్తీ దానిని నాశనం చేయదని అన్నారు. డీఎంకే నేతలను టార్గెట్ చేస్తూ.. ఉదయనిధి స్టాలిన్ ఈ వ్యాఖ్య చేయడం దురదృష్టకరమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సనాతన్ ధర్మం వసుధైవ కుటుంబం అనే సందేశాన్ని ఇచ్చిందని.. అంటే ప్రపంచమంతా మన కుటుంబమేనని తెలిపారు.

Read Also: Heavy Rains: ఇండోర్‌లో వర్ష బీభత్సం.. 200 మందికి పైగా ప్రాణాలను కాపాడిన అధికారులు

సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రకటనను పలువురు బీజేపీ నేతలు, పూజారులు తీవ్రంగా విమర్శించారు. పలు ప్రతిపక్షాలు కూడా ఉదయనిధి ప్రకటన పట్ల మండిపడుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగగా.. బీజేపీ తన వ్యాఖ్యలను వక్రీకరించిందని ఉదయనిధి స్టాలిన్ చెప్పుకొచ్చారు. సనాతన ధర్మానికి సంబంధించిన వ్యాఖ్యలు భారత కూటమి ప్రకటనగా బీజేపీ పేర్కొంటోంది. అంతేకాకుండా కాంగ్రెస్, రాహుల్ గాంధీ స్టాండ్‌ను అడుగుతోంది. ఉదయనిధి ప్రకటన తర్వాత.. పొన్ముండి సనాతన ధర్మంపై డిఎంకె ఎంపి ఎ. రాజా, విద్యా మంత్రి చేసిన ప్రకటన రాజకీయాల్లో మరింత వేడిని పెంచింది.