Rajnath Singh : భారతదేశంలో పాక్ దాడుల నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితిని సమీక్షించేందుకు కీలక స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి జరిగిన ఘర్షణాత్మక దాడుల అనంతరం దేశ రాజధానిలో రక్షణ వ్యవస్థ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ కీలక భేటీకి నాయకత్వం వహించారు. ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కూడా పాల్గొన్నారు. వారందరూ ప్రస్తుతం నెలకొన్న పరిస్థుతులపై సమగ్రంగా చర్చించారని తెలుస్తోంది. సరిహద్దుల్లో చొరబాట్ల ముప్పు నేపథ్యంలో భద్రతా వ్యూహాలను పునఃపరిశీలించడం, అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం ఈ భేటీలో ప్రధాన అంశాలుగా నిలిచాయి.
Indian Army:భారత వైమానిక దళాల కౌంటర్ స్ట్రైక్.. పాక్ మిలిటరీ పోస్ట్‌లు ధ్వంసం.. వీడియో వైరల్
ఇక మరోవైపు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ చౌధురి భేటీ కానున్నారు. గురువారం రాత్రి సరిహద్దులో పెద్ద ఎత్తున జరిగిన చొరబాట్లను బీఎస్‌ఎఫ్ సమర్థవంతంగా అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై సమగ్ర నివేదిక అందించనున్నారు. అలాగే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ కూడా సమావేశంలో పాల్గొననున్నట్లు సమాచారం. చర్చల అనంతరం భద్రతా వ్యవస్థకు అవసరమైన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ సమీక్షలతో పాటు క్షేత్ర స్థాయిలో ఉన్న సాయుధ బలగాలకు అవసరమైన సహాయ సహకారాల కోసం ప్రత్యేకంగా ఒక కమాండ్ , కమ్యూనికేషన్ వ్యవస్థను రూపొందించే అంశంపై కూడా చర్చ సాగుతోంది. ఇప్పటికిప్పుడు కేంద్రం తీసుకుంటున్న ఈ చర్యలు, సరిహద్దు భద్రతను మరింత బలపరచేందుకు దోహదపడనున్నాయని అంచనా. ఈ ఘటనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగుతోంది.
Ind Pak War Effect: ఇండియా, పాకిస్తాన్ యుద్ధం ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.!
