Site icon NTV Telugu

Deepika Padukone : మౌనం వీడిన దీపికా.. భర్త రణవీర్ తో కలిసి సందడి

Dhurandhar (2)

Dhurandhar (2)

బాలీవుడ్ పవర్ కపుల్ దీపికా పదుకొణె మరియు రణవీర్ సింగ్ ఆదివారం మధ్యాహ్నం ముంబైలో సందడి చేశారు. రణవీర్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ధురందర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న తరుణంలో ఈ జంట తొలిసారిగా బహిరంగంగా కనిపించడం విశేషం. గత కొన్ని రోజులుగా ఈ సినిమా విజయంపై దీపికా సోషల్ మీడియాలో ఎటువంటి స్పందన తెలపకపోవడంపై నెట్టింట రకరకాల చర్చలు నడిచాయి. ముంబైలో జరిగిన ‘ధురందర్ 2’ ప్రత్యేక ప్రదర్శనకు దీపిక హాజరు కాకపోవడం మరుసటి రోజే ఆమె తన అత్తమామలతో కలిసి ముంబైలో ఒక సంగీత కచేరీకి హాజరవడం దీపికపై విమర్శలు వచ్చాయి.

 Also Read : DhurandharTheRevenge : ధురంధర్ 2 లో బిగ్ మిస్టేక్.. దర్శకుడిపై నెటిజన్స్ ట్రోలింగ్

వాటన్నిటీకి చెక్ పెడుతూ రణవీర్ – దీపికా కలిసి కలిసి కనిపించారు. ముంబైలోని ఒక ప్రముఖ రెస్టారెంట్‌కు లంచ్ కోసం వెళ్లిన ఈ జంటను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. రణవీర్ రెస్టారెంట్ బయటకు రాగానే అభిమానులు ఆయనను “బబ్బర్ షేర్” (Babbar Sher) అంటూ ఫ్యాన్స్ గట్టిగా నినాదాలు చేసారు. తన తాజా చిత్రంలో రణవీర్ పోషించిన పవర్‌ఫుల్ పాత్రకు గుర్తుగా అభిమానులు ఈ పేరుతో పిలుస్తూ హల్ చల్ చేసారు ఫ్యాన్స్. భర్తకు లభిస్తున్న ఈ అపూర్వ స్పందనను చూసి దీపికా పదుకొణె ఎంతో మురిసిపోయారు. సోషల్ మీడియాలో మౌనంగా ఉన్నప్పటికీ తన చిరునవ్వుతోనే రణవీర్ విజయం పట్ల తానెంత గర్వంగా ఉన్నారో చెప్పకనే చెప్పారు. అభిమానుల కేరింతల మధ్య దీపికా ఎంతో ఆనందంగా కనిపించింది.  ప్రస్తుతం ‘ధురందర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాతో రణవీర్ తన కెరీర్‌లోనే మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ వేడుకను జరుపుకునేందుకే దీపికా మరియు రణవీర్ ఇలా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

Exit mobile version