DhurandharTheRevenge : ధురంధర్ 2 లో బిగ్ మిస్టేక్.. దర్శకుడిపై నెటిజన్స్ ట్రోలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ధురందర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూనే, ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. అయితే, సినిమా ఇంతటి ఘనవిజయం సాధిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. సినిమాలో ఒక కీలక సన్నివేశంలో జరిగిన పొరపాటు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయింది.
Also Read : Pawan Kalyan : దేవకట్టా దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా
Also Read
సినిమాలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనించే నేటి తరం ప్రేక్షకులు ఒక ఫైట్ సీక్వెన్స్‌లో ఒక చిన్న లోపాన్ని గుర్తించారు. అసలు విషయమేంటంటే భారీ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ చేస్తున్న కెమెరామెన్ కూడా కొన్ని సెకన్ల పాటు ఫ్రేమ్‌లో కనిపించాడని నెటిజన్లు స్క్రీన్‌షాట్‌లను షేర్ చేస్తున్నారు. జూమ్ చేసిన ఈ క్లిప్పులు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతటి భారీ బడ్జెట్ చిత్రంలో ఇటువంటి పొరపాటు ఎలా జరిగిందని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరల్ క్లిప్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఇది దర్శకుడు ఆదిత్య ధర్ గమనించని ఎడిటింగ్ లోపం అని అంటుంటే, మరికొందరు మాత్రం ఇది కేవలం సాంకేతిక కారణాల వల్ల జరిగి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ కోసం AI ను ఎక్కువగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఇది ఏఐ చేసిన పొరపాటేనని మరికొంతమంది వాదిస్తున్నారు.ప్రస్తుతానికి ఈ వివాదంపై చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ‘ధురందర్’ లాంటి పర్‌ఫెక్ట్ యాక్షన్ సినిమాలో ఈ చిన్న “బ్లండర్” ఇప్పుడు నెటిజన్లకు ట్రోల్ మెటీరియల్ దొరికినట్టు అయింది.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!