బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇటీవల ఈ అమ్మడు నటించిన అన్నీ సినిమాలు బాక్సఫీస్ ను షేక్ చేస్తున్నాయి.. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. దీపికా ప్రగ్నెంట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.. దీపికా లేటెస్ట్ లుక్ లో ఆమె ప్రగ్నెంట్ లాగా కనిపించలేదు.. దాంతో వీడియో తెగ వైరల్ అవుతుంది..
అయితే దీపికా పదుకోన్ ఫిబ్రవరి 18న లండన్‌లో జరిగిన బాఫ్టా (బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) అవార్డుల కార్యక్రమంలో వ్యాఖ్యాతలలో ఒకరిగా పాల్గొన్నారు. ఈ వేడుకలో బంగారు, వెండి రంగుల కలయికలో ఉన్న చీరను ధరించి అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది.. ఈ సందర్భంలో ఆమె చీర కొంగుతో తన బేబీ బంప్‌ను దాచుకోవడానికి ప్రయత్నించారంటూ అభిమానులు గుసగుసలు చెబుతున్నారు.. ఈ అమ్మడు రెడ్ కార్పేట్ పై నడుస్తూ తాను చీర కొంగును కప్పుకోవడంతో ఈ అనుమానాలకు తెర లేపింది..
ఇక ఆమె ఫ్యాన్స్ కూడా ఆమె ప్రగ్నెంట్ అనే నమ్ముతున్నారు.. బేబీ పదుకోన్ తప్పకుండా వస్తుంది’ అంటూ కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. తాజాగా ఎయిర్ పోర్ట్ లో కనిపించిన వీడియో లో బేబీ బంప్స్ కనిపించలేదు.. దీంతో బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. సరోగసి ద్వారా పిల్లల్ని కంటున్నారని టాక్.. 2018 లో ఈమె రణవీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ఇక సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తున్నారు.. ప్రభాస్‌తో ‘కల్కి’, హిందీలో ‘సింగమ్ రిటర్న్స్’ సినిమాల్లో చేస్తున్నారు..